Jupally :  తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు మల్ల రాదు..!?

breaking news-batukamma

Jupally :  తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీమళ్లీ అధికారంలోకి రావడం డౌటేనని ఆయన కామెంట్ చేశారు.

ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

“వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు! నేను మళ్లీ గెలుస్తానో లేదో తెలియదు.! మా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు..” అని అన్నారు.

నేను హామీలు ఇవ్వను.. ఎందుకంటే వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు.. అందుకే నేను హామీలు ఇవ్వను అని అన్నారు.

ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

తన వంతుగా ప్రయత్నం మాత్రం చేస్తానని.. తన నియోజకవర్గంలోనూ హామీలు ఇవ్వనని చెప్పారు. తన జేబులోంచి ఇచ్చేవి కావు కాబట్టి హామీలు ఇవ్వబోనన్నారు.

Read Also :