KTR : రేవంత్ పాలనలో అరాచకత్వం, అవినీతి, ఆర్థిక విధ్వంసం..!

KTR serious allegations on revanth reddy over gst collections

KTR : తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy)పాలనలో తెలంగాణలో ఆర్థిక విధ్వంసం జరుగుతోందని మండిపడ్డారు.

జీఎస్టీ వసూళ్ల వృద్ధిరేటు తగ్గిపోవడంపై ఆయన ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు.

సెప్టెంబర్ 2025లో వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల వృద్ధి రేటులో దేశంలోనే అట్టడుగున తెలంగాణ ఉండటం దారుణం.

సరిగ్గా రెండేళ్ల క్రితం, కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది.

రేవంత్ పరిపాలనలో తెలంగాణ ఆర్థికవ్యవస్థ ఎంత విధ్వంసం పాలయ్యిందో చెప్పే ఒక సూచిక  ఇది!

బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దన్నుతో ఆర్థికవ్యవస్థ పరుగులు తీసింది.

వ్యవసాయం నుండి ఐటీ వరకూ అన్ని రంగాలూ రికార్డులు తిరగరాశాయి.

ఇవ్వాళ కాంగ్రెస్ పాలనలో పండగొచ్చినా, పబ్బమొచ్చినా కూడా అన్ని రంగాలూ నేలచూపులే చూస్తున్నాయి.

వ్యవసాయం నుండి రియల్ ఎస్టేట్ వరకూ అన్ని రంగాల్లో దైన్యమే తాండవిస్తోంది.

అరాచకత్వం, అవినీతి, అనుభవలేమి కలగలసిన రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి గురవుతోంది!

Read Also :