Jubileehills Voters : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,99,000 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 1 జూలై 2025ను అర్హత తేదీగా తీసుకుని ఈ జాబితా రెడీ చేసినట్టు చెప్పారు.
ఓటర్లలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు ఉన్నారు. అలాగే 25 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు కూడా ఉన్నారు.
6,106 మంది యువ ఓటర్లు (18–19 సంవత్సరాలు), 2,613 మంది వృద్ధులు (80 ఏళ్లు పైబడిన వారు) ఉన్నారు.
అలాగే 1,891 మంది వికలాంగులు ఉన్నారు. వీరిలో 519 మంది చూపు కోల్పోయిన వారు, 667 మంది కదలికల లోపం ఉన్న వారు, 311 మంది వినికిడి/మాట లోపం కలిగిన వారు ఉన్నారు. విదేశీ ఓటర్లు 95 మంది ఉన్నారు.
సెప్టెంబర్ 2న విడుదలైన ప్రాథమిక జాబితాలో 3,92,669 ఓటర్లు ఉన్నట్టు అధికారు తెలిపారు. వివిధ సవరణలు, కొత్త నమోదుతో సంఖ్య పెరిగిందన్నారు. కొత్తగా 6,976 మంది ఓటర్లు చేరారన్నారు. 663 మంది ఓటర్లను తొలగించినట్టు చెప్పారు.
జూబ్లీహిల్స్ లో ఉపఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Read Also :

