High court : కాళేశ్వరం (Kaleshwaram)అంశంపై సీబీఐ(CBI)తో విచారణ జరిపించాలన్న రేవంత్ రెడ్డి సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది.
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టు(High court) బ్రేక్ వేసింది. కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
అక్టోబర్ ఏడో తేదీన తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది.
Read Also : కవిత కొత్త పార్టీ ఎప్పుడంటే..?
కాళేశ్వరం ప్రాజెక్టులోని(Kaleshwaram project) మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి పీసీ ఘోష్ తో(pc ghosh) విచారణ జరిపించారు.
దానిని ఆదివారం రోజు (31 ఆగస్ట్) అసెంబ్లీలో పెట్టి స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. తర్వాత ఈ అంశాన్ని సీబీఐకి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు.
కమిషన్ రిపోర్ట్ పై బీఆర్ఎస్ పార్టీతో పాటు, ఎంఐఎం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అందులో లోపాలున్నాయని చెప్పింది.
మరోవైపు.. బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని మార్చడం.. కేవలం కమిషన్ల కోసమేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మేడిగడ్డలో పిల్లర్ కుంగడానికి అదే కారణమని అంటోంది. సీబీఐ ఎంక్వైరీతో నిజాలు నిగ్గు తేలుస్తామని చెప్పింది.
కానీ.. దానికి ప్రస్తుతానికి బ్రేక్ పడింది.

