BIG Breaking : “ఓటుకు నోటు” కేసులో కీలక మలుపు..!

big-breaking-supreme-court-key-verdict-on-revanth-reddys-note-for-vote-case

BIG Breaking : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నుండి మత్తయ్యను తప్పిస్తూ తీర్పు చెప్పింది.

2015లో జరిగిన ఈ కేసులో రేవంత్ రెడ్డి ఏ 1 కాగా మత్తయ్య ఏ4 గా ఉన్నారు.

2016లో ఆయనను తప్పిస్తూ తెలంగాణ హైకోర్టు  తీర్పు చెప్పింది. దీనిని అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

దీనిపై ఈ నెల 22న తుది వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ తీర్పు వెల్లడించింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డికి ఓటు వేసేందుకు.. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీవెన్ సన్ కు రూ.5 కోట్లు ఇచ్చేందుకు వెళ్లి.. రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. కొద్దిరోజులు జైలులో ఉన్నారు.

ఇప్పుడు ఆనాటి ఓటుకు నోటు కేసులో ఉన్న కీలక నిందితులంతా రాష్ట్రంలో ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు.

ఉదయసింహా ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా ఉన్నారు. చంద్రబాబును తప్పిస్తూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తికి రేవంత్ రెడ్డి సర్కారు కీలక పదవి ఇచ్చింది.

అయితే.. ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని.. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, నారాలోకేష్, వేం నరేందర్ రెడ్డి, అతని కుమారులే సూత్రధారులు, పాత్ర దారులని ఇటీవలే మత్తయ్య కోర్టుకు లేఖ రాశారు.

Read Also :