Indiramma houses : ఇందిరమ్మఇండ్లలో భారీగా అవినీతి.. మంత్రి సాక్షిగా బట్టబయలు..!

BREAKING NEWS-10-BATUKAMMA.COM

Indiramma houses : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల స్కీంలో అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు. స్కీం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని వందల మంది ఆరోపణలు చేశారు.

కాంగ్రెస్ నాయకులు డబ్బులు తీసుకుని ఇళ్లు కేటాయిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. డబ్బులు ఇవ్వని వాళ్లు ఇండ్లు రద్దు చేశారని కూడా ఆరోపణలు వినిపించాయి.

స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టాలు చేతికి ఇచ్చిన తర్వాత కూడా .. కిందిస్థాయి నాయకులు లంచాల కోసం ఇండ్లు క్యాన్సిల్ చేయించారని ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు.

కాంగ్రెస్ నాయకులే కాదు.. మరోవైపు అధికారులు కూడా అదే పని. ఇంటి పనుల ఫొటోలు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయడానికి రూ.20 వేల నుండి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.

కొందరు అధికారులైతే ఇల్లు కడుతున్న మేస్త్రీలకు, కాంట్రాక్టర్లకు ఫోన్లు చేసి బెదించారు. ఆ ఆడియోలు కూడా బయటకు వచ్చాయి.

ఇలా ప్రతీ చోటా.. ప్రతీ ఒక్కరు ఇందిరమ్మ ఇండ్లలో(Indiramma houses) దోపిడీ జరుగుతోందని ఆరోపణలు వచ్చినా సర్కారు ముందు నుంచి పట్టించుకోలేదు. ఇప్పుడు ఆరోపణలు తీవ్రం కావడం, పలువురు లబ్ధిదారులు బయటకు వచ్చి ఫిర్యాదు చేయడంతో సర్కారు ఇరకాటంలో పడింది.

indiramma house model

ఇప్పుడు చేసేదేం లేక చర్యలకు ఉపక్రమించింది. ఇండ్లు ఇవ్వకుండానే డబ్బులు చెల్లించిన నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది. బిల్లు మంజూరు కోసం రూ.10 డిమాండ్ చేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యుడిని తొలగించింది.

ఇందిరమ్మ ఇండ్లపై ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కు పెద్ద సంఖ్యలో కాల్ వస్తున్నాయి. అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో చర్యలు తీసుకోక తప్పని పరిస్థితిలో సర్కారు పడిపోయింది.

కాల్ సెంటర్ ఏర్పాటుతో గుట్టు రట్టు..

గత వారమే కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. వారం రోజుల్లోనే వందలాది ఫోన్లు రావడం.. వారం రోజుల ఫిర్యాదులతోనే నలుగురు అధికారులను సస్పెండ్ చేశారంటే.. ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

కాల్ సెంటర్ ఏర్పాటు చేయకముందు కొన్ని వందల మంది మీడియా ముందుకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అవినీతి జరుగుతోందని.. డబ్బులు ఇవ్వలేదని అన్యాయం చేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. అయినా సర్కారు(Revanth reddy) పట్టించుకోలేదు.

ఇప్పుడు కాల్ సెంటర్ ఏర్పాటు తర్వాత కేవలం వారం రోజుల్లో నలుగురు అధికారుల సస్పెన్షన్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడిపై కేసు నమోదైంది.

ఇన్ని నెలల అవినీతిపై చర్యలేవి..?

స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(ponguleti Srinivas reddy) జరిపిన రివ్యూలోనే ఈ అంశాలన్నీ బయటపడ్డాయి. అంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అప్పటి దాకా అధికారులు ఎందుకు పట్టించుకోలేదన్నది చర్చనీయాంశంగా మారింది.

ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరైనా లంచం అడిగితే.. టోల్ ఫ్రీ నెంబ‌ర్ 1800-599-5991 కు ఫోన్ చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

అయితే.. కాల్ సెంటర్ ప్రారంభించక ముందు.. ఇళ్ల కేటాయింపు కోసం, బిల్లుల కోసం డబ్బులు వసూలు చేసిన వారిపైనా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

..

Read Also :