Teenmar mallanna : ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (Telangana rajyadhikara party)పేరుతో.. పార్టీని ప్రకటించారు. స్టార్ హోటల్ లో కార్యక్రమం ఏర్పాటు చేశారు.
పార్టీ జెండాను రిలీజ్ చేశారు. బీసీలకు రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తానని ప్రకటించారు.
అయితే.. తీన్మార్ మల్లన్న పార్టీ జెండాపై కాంట్రావర్సీ మొదలైంది.

ఆకుపచ్చ, ఎరుపు రంగులతో ఆయన తన పార్టీ జెండాను ప్రకటించారు. కానీ ఇదే రంగులో పలు దేశాల జెండాలు ఉండటం ఆసక్తికరంగా మారింది.
చాలా దేశాల రంగులు ఎరుపు, ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. రెండు దేశాల జెండాలు మాత్రం పూర్తిగా తీన్మార్ మల్లన్న (Teenmar mallanna)జెండాలానే ఉన్నాయి.
Read Also :
- బ్లాక్ డ్రెస్ లో రెచ్చిపోయిన రెజీనా
- దీపికాకు షాకిచ్చిన సందీప్ రెడ్డి..!
- శ్రీవారి సేవలో వెంకటేష్ బ్యూటీ
- మెదడును తినేస్తున్న కొత్త రోగం
తీన్మార్ మల్లన్ పార్టీ జెండా.. యాజిటీజ్ గా ఆఫ్గనిస్తాన్, బుర్కినోఫాసో జెండాల మాదిరిగానే ఉంది. పైన చిన్నగా డిజైన్ మార్చి యాజిటీజ్ పరాయి దేశాల జెండాను కాపీ కొట్టేశాడని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాంగ్రెస్ లో చేరకముందు.. కాంగ్రెస్ నుండి బయటకు వచ్చాక.. బీజేపీకి దగ్గరగా మెలిగే తీన్మార్ మల్లన్న ముస్లిం దేశాల జెండాను తీసుకొచ్చి తన పార్టీ జెండాలో పెట్టుకోవడం ఏంటన్న చర్చ జరుగుతోంది.

అయితే.. తీన్మార్ మల్లన్న రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అరంగేట్రం చేయకముందు విశారదన్ మహారాజ్ దగ్గర శిష్యరికం చేశారు. ఆయన దగ్గర ఉండి అన్నీ నేర్చుకున్నారు. మాట్లాడటం ఎలా అనే దాని నుండి.. అనేక అంశాలను ఆకళింపు చేసుకున్నారు.
ఆ తర్వాత క్యూ న్యూస్ పెట్టి.. అవే మాటలు, కథలు, పంచ్ డైలాగులు స్క్రీన్ ముందు చెప్పడం మొదలు పెట్టారు. విశారదన్ మహారాజ్ దగ్గర కాపీ కొట్టి.. తన యూట్యూబ్ ఛానల్లో చెప్పేవాడని విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు జెండాల విషయంలో కూడా అలాగే చేస్తున్నాడని అంతా చర్చించుకుంటున్నారు.
…

