Breaking news : రాష్ట్రంలో సోషల్ మీడియాపై పూర్తిగా నిషేధం పెట్టే దిశగా రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాపై విపరీతమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి.
ఏ చిన్న పోస్టు పెట్టినా కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. ప్రజలు, యువకులు తమ గోడును సోషల్ మీడియాలో వెళ్లబోసుకున్నా కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) సోషల్ మీడియా కార్యకర్తలపై కొన్ని వేల కేసులు నమోదు చేశారు.
ప్రజలు, ప్రతిపక్షాలు ఎవ్వరినీ వదలకుండా జైళ్లలో పెడుతున్నారు. దీంతో ఇటీవల హైకోర్టు చాలా కీలకమైన తీర్పు ఇచ్చింది.
సోషల్ మీడియాలో పోస్టులపై ఇష్టారీతిగా కేసులు పెట్టొద్దని పోలీసు శాఖను హెచ్చరించింది. అనవసరమైన కేసులు నమోదు చేస్తే చర్యలు తప్పదని చెప్పింది.


హైకోర్టు (Telangana High court) ఆదేశాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారికి కాస్త ఊరట లభించినట్టయ్యింది. కానీ అంతలోనే రాష్ట్ర సర్కారు మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఏకంగా రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటూ అన్ని పోలీస్ స్టేషన్లకు మెమో జారీ చేసింది.

పక్కా ప్లానింగ్ తోనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్లపై సర్కారు కేసులు..!
రెగ్యులర్ గా హత్యలు, దోపిడీల వంటి నేరాలు చేసే వాళ్ల మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఎన్నికల వంటి సమయాల్లో వారు బయట ఉంటే అల్లర్లు సృష్టిస్తారని జైళ్లలో వేస్తారు.
సోషల్ మీడియా యాక్టివిస్టుల విషయంలోనూ రేవంత్ సర్కారు ఇలాగే చేయబోతున్నట్టుగా కనిపిస్తోంది. చాలా పకడ్బంధీగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన చాలా మందిపై పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసింది రేవంత్ రెడ్డి సర్కారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర డిజిటల్ మీడియా డైరెక్టర్ గా కొణతం దిలీప్ తో సహా.. పార్టీ కార్యకర్త నల్లబాలుపై అనేక కేసులు పెట్టింది.
సర్కారు తప్పులను ప్రశ్నిస్తున్న జర్నలిస్టు గౌతమ్ గౌడ్ సహా చాలామందిపై రేవంత్ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ప్రభుత్వం అక్కడితో ఆగలేదు. కోర్టుల్లో కూడా వీళ్లంతా రెగ్యులర్ గా నేరాలు చేసేవాళ్లు.. అని ప్రభుత్వం చెప్పింది.
Habitual Offenders ముద్రవేసి నోరు మూసే ప్రయత్నం…!
కోర్టుకు ప్రభుత్వం తరుపున దాఖలు చేసిన అఫిడివిట్లలో వీళ్లంతా Habitual Offenders అని చెప్పింది. అంటే వీళ్లంతా నేరప్రవృత్తితోనే ఇదంతా చేస్తున్నారు. వీళ్ల వృత్తే నేరాలు చేయడం అన్నట్టుగా కోర్టును నమ్మించే ప్రయత్నం చేసింది.
కాబట్టి… ఇప్పటికే పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. కాబట్టి.. ఇప్పుడు వాటిని బూచీగా చూపించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వేలాది మందిపై రౌడీషీట్ లు ఓపెన్ చేసేందుకు సర్కారు రెడీ అయ్యింది. వాళ్లు మరోసారి నోరు తెరవకుండా ఉండేలా ప్రయత్నాలు చేస్తోంది.
మరోవైపు.. ఇటీవల కోర్టు తీర్పుతో ప్రజల్లో కాస్త సంతోషం కలిగింది. సోషల్ మీడియాలో తమ గోడు చెప్పుకునేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని భావించారు. దీంతో సర్కారుకు భయం మొదలైంది.
హైకోర్టు అండ చూసుకుని ప్రజలు మళ్లీ ప్రశ్నించడం మొదలు పెడితే.. తమ బతుకు ఆగమవుతుందని భావించినట్టుంది.
అందుకే సోషల్ మీడియా పోస్టులు పెట్టే వారిపైనా రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.
Read Also :

