Revanth Reddy : ముగ్గురు రెడ్లకు బిగ్ షాక్..?

Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy), మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మెగా కృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే (ponguleti)పొంగులేటి, మెగాకృష్ణారెడ్డికి(MEIL) ఇచ్చిన గిఫ్ట్ విషయంలో ఎదురుదెబ్బ తగిలింది.
నారాయణపేట–కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై బ్రేక్ వేసిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT).
ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు, పనులు చేపట్టరాదని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఈ ప్రాజెక్టుపై ఎన్‌జీటీ జోక్యం చేసుకోవడంతో తాత్కాలికంగా పనులు నిలిచిపోయాయి.
ఈ ప్రాజెక్టు కాంట్రాక్టుల అప్పగింత విషయంలో మొదటి నుంచి వివాదం ఉంది. ఎల్ అండ్ టీ లాంటి అంతర్జాతీయ సంస్థ బిడ్ దాఖలు చేసినప్పటికీ దాన్ని పక్కనపెట్టారని ఆరోపణలు వచ్చాయి.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన కంపెనీ, మెగా కృష్ణారెడ్డి కంపెనీలకు చెరి సగం వాటాలుగా పంచుకున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది.
ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాజెక్టు పనులపై స్టే ఇవ్వడంతో ముగ్గురికి షాక్ తగిలినట్టయ్యింది.