ACTOR : రోడ్డు ప్రమాదంలో ఇద్దరి ప్రాణాలు బలికావడంతో పాటు పలువురు గాయపడటానికి కారణమైన టీవీ నటుడు ఖయూమ్ అలియాస్ లోబోకు ఏడాది జైలు శిక్షను జనగామ కోర్టు గురువారం విధించింది.
పోలీసుల వివరాల ప్రకారం, 2018 మే 21న లోబో బృందం ఓ టీవీ ఛానల్ తరఫున వీడియో షూట్ కోసం రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు, వేయిస్తంభాల ఆలయం వంటి ప్రదేశాలు సందర్శించింది. అనంతరం లోబో స్వయంగా కారు నడుపుతూ వరంగల్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు.
ఆటోలో ఉన్న ఖిలాషాపురం గ్రామానికి చెందిన మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు తీవ్ర గాయాలతో మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. కారు బోల్తా పడటంతో లోబోతో పాటు అతని బృందానికి కూడా స్వల్ప గాయాలయ్యాయి.
మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. విచారణ అనంతరం కోర్టు లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
Read Also :

