Sony : సోనీ సూపర్ ఫాస్ట్ మెమొరీ కార్డ్..! ఇది బాహుబలి

Sony launched CF express 4 standered type a memory cards

Sony : వీడియో క్రియేటర్లు మరియు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, సోనీ ఇండియా కొత్తగా CF express 4 స్టాండర్డ్ టైప్ A మెమొరీ కార్డ్‌లు విడుదల చేసింది.

వాటితో పాటు ఈ కార్డ్‌లకు అనుకూలంగా ఉండే MRW-G3 CF express టైప్ A కార్డ్ రీడర్‌ను కూడా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

CEA-G1920T (1920 GB), CEA-G960T (960 GB) అనే రెండు వేరియంట్లలో లభించే ఈ తాజా మెమొరీ కార్డులు, గత మోడల్స్‌తో పోలిస్తే రెండింతల వేగాన్ని అందిస్తాయి.

వీటి రీడ్ స్పీడ్ గరిష్టంగా 1800 MB/s, రైట్ స్పీడ్ గరిష్టంగా 1700 MB/s వరకు చేరుతుంది.

ఫీచర్లు..

అత్యధిక వేగం, విస్తృత సామర్థ్యం..

ఈ కార్డులు CFexpress 4 స్టాండర్డ్‌తో రూపొందించబడ్డాయి. 1920 GB మరియు 960 GB సామర్థ్యం కలిగిన వీటిలో హై-రిజల్యూషన్ ఫోటోలు, 4K లేదా అంతకంటే అధిక రిజల్యూషన్ వీడియోలను సులభంగా భద్రపరచవచ్చు.

కనీస రైట్ స్పీడ్ 400 MB/s ఉండటం వల్ల వీడియో షూట్ సమయంలో ఎటువంటి అంతరాయం లేకుండా హై-బిట్‌రేట్ ఫుటేజ్ రికార్డ్ చేయవచ్చు.

 దృఢమైన నిర్మాణం..

మునుపటి మోడల్స్‌తో పోలిస్తే ఇవి 10 రెట్లు ఎక్కువ వంగుడు నిరోధకత (sony) మరియు 5 రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంటాయి. 7.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా ఈ కార్డులు దెబ్బతినకుండా రక్షణ అందిస్తాయి.

ధరలు మరియు లభ్యత..

మోడల్ ధర (INR)

CEA-G1920T (1920 GB)           ₹97,490

CEA-G960T (960 GB)               ₹59,990

MRW-G3                                 ₹17,990

CFexpress టైప్ A కార్డ్ రీడర్ MRW-G3

  • అత్యంత వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్ – USB 40Gbps సపోర్ట్‌తో పెద్ద ఫైల్స్‌ను క్షణాల్లో బదిలీ చేయవచ్చు.
  • బహుళ డివైజ్‌లతో అనుకూలం – కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లతో సులభంగా కనెక్ట్ అవుతుంది.
  • వేడిని నియంత్రించే సాంకేతికత – ప్రత్యేక హీట్-డిసిపేషన్ వ్యవస్థ ఉండటం వల్ల ఎక్కువసేపు ఉపయోగించినా వేడి అవ్వకుండా నిరంతర పనితీరును అందిస్తుంది.

ఈ కొత్త ఉత్పత్తులు సోనీ రిటైల్ స్టోర్స్, ప్రముఖ ఎలక్ట్రానిక్ షాపులు, www.ShopatSC.com మరియు ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లలో అందుబాటులో ఉన్నాయి.

Read Also :