Maruti Suzuki : మారుతీ కొత్త ఎలక్రిక్ కారు.. ఫీచర్స్ చూస్తే షాకే..!

 భారతదేశంలో విద్యుత్ వాహనాల వినియోగం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్‌లోని హన్సల్‌పుర్ మారుతీ సుజుకీ మోటార్‌ ప్లాంట్‌లో రెండు కీలక ప్రాజెక్టులకు నాంది పలికారు. ఈ సందర్భంగా **మారుతీ సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు *ఇ-విటారా (eVITARA)***ను ప్రారంభించడమే కాకుండా, దేశంలోనే తొలి హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్‌ ఉత్పత్తి ప్లాంట్కు జెండా ఊపారు.

ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, జపాన్ రాయబారి కీచీ ఒనొ పాల్గొన్నారు. “భారత్ స్వావలంబన సాధనలో ఇది ఒక కీలక ఘట్టం. ఇక్కడ ఉత్పత్తి అయ్యే వాహనాలు 100 దేశాలకు ఎగుమతి కానున్నాయి” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తొలి ఇ-విటారా ఎగుమతి యూకేకు జరగనుంది.

ఇ-విటారా ప్రత్యేకతలు

  • రెండు బ్యాటరీ ఆప్షన్లు: 49kWh, 61kWh

  • 49kWh వేరియంట్‌ → 144HP శక్తి, 189Nm టార్క్‌

  • 61kWh వేరియంట్‌ → 174BHP శక్తి, 189Nm టార్క్‌

  • పెద్ద బ్యాటరీ వేరియంట్‌ → 500కిమీ పైగా రేంజ్‌

  • స్మార్ట్ హోమ్ ఛార్జర్‌, ఇన్‌స్టలేషన్ సపోర్ట్‌ అందుబాటులో

ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌

మారుతీ సుజుకీ ఇండియా MD & CEO హిసాషి టకేయుచి తెలిపిన వివరాల ప్రకారం, దేశంలో ఈ ప్రాజెక్టుకు ₹2,100 కోట్లు పెట్టుబడి పెట్టబడింది.

  • తొలి దశలో 100 ప్రధాన నగరాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలు

  • ప్రతి 5–10 కిమీకి ఒక ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు

  • EV యూజర్లకు స్మార్ట్ హోమ్ ఛార్జర్‌, ఇన్‌స్టలేషన్ సహాయం

ఈ ప్రాజెక్టులతో భారత్‌ను గ్లోబల్ ప్రొడక్షన్ హబ్గా మలచడమే లక్ష్యంగా మారుతీ సుజుకీ ముందుకు సాగుతోంది.