Clear tax : పన్నుల చెల్లింపుల్లో క్లియర్ టాక్స్ ప్రవేశపెట్టిన ఏఐ దూసుకుపోతోంది. దీని సహాయంతో కొన్ని వారాల్లోనే దాదాపు 50,000 మంది వివిధ భాషల్లో ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారు. ఇంగ్లీషేతర భాషల్లో సులభంగా ట్యాక్స్ ఫైల్ చేయడానికి ఇది ఉపయోగపడుతోంది.
ఈ ఏడాది జులై లో క్లియర్ ట్యాక్స్ (Clear tax)ఏఐని ప్రవేశపెట్టారు. ఇది దేవంలోనే మొదటి ఏఐ ఆధారిత ట్యాక్స్ ఫైలింగ్ అసిస్టెంట్. వినియోగదారులు తమకు నచ్చిన భాషలో కేవలం చాట్ చేయడం ద్వారా పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, తెలుగు, మరియు బంగ్లా వంటి ఆరు ప్రాంతీయ భాషల్లో ఇది అందుబాటులో ఉంది.
ఈ సందర్భంగా క్లియర్‌టాక్స్ వ్యవస్థాపకుడు, CEO ఆర్చిత్ గుప్తా మాట్లాడుతూ.. ఈ విజయం డిజిటల్ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తోందన్నారు. AIతో ప్రాంతీయ భాషల్లో సేవలు అందించడంతో చిన్న పట్టణాలకు చెందిన వారు కూడా సులభంగా రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారన్నారు.
మొత్తం ఫైలింగ్స్ లో ఎక్కువగా 2 టయర్, 3 టయర్ సిటీస్ నుండే జరిగాయన్నారు. చాలామంది రిటర్న్స్(IT Returns filing ) ఫైల్ చేశారని చెప్పారు.
రిటర్న్స్ ఫైలింగ్ ప్రక్రియను క్లియర్ టాక్స్ సులభతరం చేస్తుంది. ఆదాయపు పన్ను శాఖ నుండి అవసరమైన డేటాలో 95% వరకు ఆటోమేటిక్‌గా సేకరిస్తుంది. అర్హతగల అన్ని మినహాయింపులను వర్తింపజేస్తుంది.
సరైన ITR ఫారమ్‌ను ఎంపిక చేస్తుంది.
వినియోగదారులు తమ PAN నంబర్‌ను నమోదు చేస్తే చాలు. మిగతా పనిని ఇది పూర్తి చేస్తుంది. ఈ సేవలు వాట్సాప్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, స్లాక్ మరియు క్లియర్‌టాక్స్ వెబ్‌సైట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నాయి.
Read Also :

