CBSE : CBSE (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు దీనికి సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఈసారి 10వ తరగతి పరీక్షల్లో పెద్ద మార్పు ఉంది. ఒకే విద్యాసంవత్సరంలో 10వ తరగతి పరీక్షలు రెండు సార్లు జరుగుతాయి. మొదటి దశ ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6 వరకు, రెండో దశ మే 15 నుంచి జూన్ 1 వరకు నిర్వహించబడుతుంది. రెండో దశ ఐచ్ఛికం, మరియు రెండు సార్లు రాసిన విద్యార్థులలో గుడ్ మార్కులు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 9 వరకు కొనసాగుతాయి. ప్రతి సబ్జెక్ట్ పరీక్ష పూర్తయిన 10 రోజుల తర్వాత ఆ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమై, 12 రోజుల్లో పూర్తవుతుందని CBSE స్పష్టంచేసింది.
ఇకపై ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్షలు ఉండవు. రెండో సెషన్‌నే సప్లిమెంటరీగా పరిగణిస్తారు, కావున విద్యార్థులు మార్కులు పెంచుకునేందుకు రెండో దశలో రాయవచ్చు.
భారతదేశం సహా 26 దేశాల్లో సుమారు 45 లక్షల మంది విద్యార్థులు 204 సబ్జెక్టుల్లో ఈ బోర్డు పరీక్షల్లో పాల్గొననున్నారు.
Read Also :

