Tirumala : ఏడు కొండలవాడా..! ఏంటీ ఈ పంచాయితీ..?

tdp ysrcp fight about tirumala temple

Tirumala : ఏపీ రాజకీయాలు ప్రతీసారి పవిత్రమైన తిరుమల చుట్టూరే తిరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే లడ్డూలో(Tirumala laddu) జంతువుల కొవ్వు ఉన్న నెయ్య వాడుతున్నారని ప్రచారం చేశారు. చివరకు అలాంటిదేం లేదని తేలింది.

అప్పటిదాకా పరమపవిత్రంగా భావించే శ్రీవారి(tirumala) లడ్డూని భక్తులు ఇప్పుడు తినాలంటేనే భయపడుతున్నారు.

ఆ తర్వాత తొక్కిసలాట జరిగింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు పెద్ద రాజకీయమే నడిచింది.

ఇక ఇప్పుడు మరోసారి తిరుమలపై రాజకీయం మొదలైంది. చంద్రగ్రహణం రోజు మొదలైన రాజకీయం ఇప్పటికీ నడుస్తూనే ఉంది.

తిరుమల ఆలయ తలుపుల తాళం టీవీ5(tv5) రిపోర్టర్ వేస్తున్నట్టుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టీవీ 5 అంటే.. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు(br naidu) చెందినది.

దీంతో తిరుమలను అపవిత్రం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తోంది. కూటమి పాలనలో తిరుమలకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆరోపిస్తోంది.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపణలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. టీవీ5 రిపోర్టర్ ఫొటో తీసుకున్నప్పుడు సాక్షి రిపోర్టర్ (sakshi) కూడా పక్కనే ఉన్నాడని ఎక్స్ లో ఫొటోలు పెట్టింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే తిరుమలపై రాజకీయం చేస్తోందని కౌంటర్ ఇచ్చింది. సరదాగా దిగిన ఫొటోలపై రాజకీయం ఏంటని మండిపడింది.

https://twitter.com/JaiTDP/status/1965741489234821521

అయితే.. పవిత్రమైన తిరుమలలో, కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు మాత్రమే జరిపించాల్సిన క్రతువుల విషయంలో ఇలా ఎందుకు చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు.

రెండు పార్టీలు తన్నులాడుకుని వేంకటేశ్వరుడికి మచ్చ తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Read Also :