హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటుంది. ఈ ఏడాది “మేరీ హస్బెండ్ కీ బీవీ” సినిమా చేసి అభిమానులను ఆకట్టుకుంది. ఇక త్వరలో అజయ్ దేవగణ్ హీరోగా వస్తోన్న “దేదే ప్యార్ దే-2” సినిమాలో రకుల్ కనిపించబోతోంది. ఇందులో ఆర్. మాధవన్, టబు కూడా ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది.
సినిమాలకే కాకుండా రకుల్ తన ఆరోగ్యం, ఫిట్నెస్ పైన కూడా చాలా శ్రద్ధ పెట్టుతుంది. జిమ్‌లో కసరత్తులు చేస్తూ వాటి వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. అందుకే ఎప్పుడూ గ్లామరస్‌గా మెయింటైన్ అవుతుంది.
ఇటీవల రకుల్ ముంబయి ఎయిర్‌పోర్టులో కనిపించింది. అప్పుడు ఆమె మెడపై ఓ చిన్న ప్యాచ్ కనిపించింది. ఆ వీడియో వైరల్ అవడంతో, “ఇది ఏమిటి?” అని నెటిజన్స్ సెర్చ్ చేయసాగారు. చివరికి అది లైఫ్వేవ్ ఎక్స్39 స్టెమ్ సెల్ ప్యాచ్ అని తేలింది.

ఈ ప్యాచ్‌లో ఎటువంటి మందులు ఉండవు. కానీ శరీరంలోని స్టెమ్ సెల్స్ యాక్టివ్ అయ్యేలా చేసి, శక్తిని పెంచడంలో, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అంటున్నారు. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీలు కూడా వీటిని వాడుతున్నారు. వీటి ధర మాత్రం వేల రూపాయలలో ఉంటుందని సమాచారం.
Read Also : యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఉదయభాను

