NDSA Kaleshwaram : అన్నారం,సుందిళ్ల కూలిపోతయని NDSA చెప్పిందా.?

NDSA report on Kaleshwaram project barrages

NDSA Kaleshwaram : పొద్దున లేస్తే NDSA మీద నెపం పెడుతూ, అన్నారం సుందిళ్ల బ్యారేజీలను వాడకుండా అలా ఖాళీగా పెట్టుతున్నరు కదా
మరి అదే NDSA తన 2024–25 వార్షిక నివేదికలో ఈ రెండు బ్యారేజీలను కేటగిరీ–2 లోనే పెట్టింది.
ఇదే కేటగిరీ–2లో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కూడా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం… అదే సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్, శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఇదే కేటగిరీ–2లో ఉన్నయ్.
అన్నింటి స్టేటస్ ఒక్కటే “SAME BUT POOR”
మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టుగా, కేటగిరీ–2లో ఉన్న అన్నారం , సుందిళ్ల బ్యారేజీల్లో నీళ్లు నిలిపితే కొట్టుకుపోతయ్ అనేదే నిజమైతే…
మరి అదే కేటగిరీ–2లో ఉన్న శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులను ఎట్లా వాడుతున్నరు?
ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నదే నిజమైతే, అన్నారం–సుందిళ్ల బ్యారేజీలు అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ–1లో ఉండాలి కదా?
మరి NDSA ఈ రెండింటినీ కేటగిరీ–2లోనే ఎందుకు పెట్టింది?
అన్నారం–సుందిళ్లలో నీళ్లు నిల్వ చేయొద్దని NDSA రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందా?
ఇస్తే… ఆ ఆదేశాలను పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టదు ఈ కాంగిరేసు ప్రభుత్వం?
సేఫ్టీ దృష్ట్యా నీళ్లు నిల్వ చేయకూడదని అనుకుంటే, అదే కేటగిరీ–2లో ఉన్న మిగతా ప్రాజెక్టుల విషయంలోనూ అదే నిబంధనలు వర్తించాలి కదా
కానీ అదే కేటగిరీ–2లో ఉన్న ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, ధవళేశ్వరం, శ్రీశైలం ప్రాజెక్టులు వినియోగంలోనే ఉన్నయ్ కదా ?
మరి ఒక్క అన్నారం–సుందిళ్ల దగ్గరికి వచ్చేసరికి మాత్రం NDSA పేరు చెప్పి నీటి నిల్వ ఎందుకు చేయడం లేదు?
NDSA సాకులతో నీళ్ళు నిలపక వాడుకోలేక కరువు అంటూ ఇప్పుడు దీర్ఘాలు తీస్తున్నరు
NDSA నివేదికను పూర్తిగా ప్రజల ముందు పెట్టండి.
నీళ్లు నిల్వ చేయొద్దని ఇచ్చిన ఆదేశాలుంటే బయటపెట్టండి.
NDSA పేరు చెప్పి ఎన్నాళ్లు తప్పించుకుంటరు?
Data source : NDSA ANNUAL REPORT 2024-25, Page No 298 and Page No 105

ఇది కూడా చదవండి :  పేదోళ్లకేనా పొదుపు   పాఠాలు ?

National dam safety authority about  annaram sundilla  barrages