పార్టీ ఫిరాయింపులు నూటికి నూరుపాళ్లు తప్పే.
అన్ని పార్టీలు ప్రతిపక్షంలో నీతులు చెప్పి..
అధికారంలోకి వచ్చాక ఫిరాయింపులను ప్రోత్సహించేవే..
పార్టీలు ఫిరాయించడంలో కూడా నైతిక, అనైతిక విధానాలున్నాయి..
నైతికం : శాసనసభాపక్ష విలీనం
అనైతికం : ఒక్కొక్క ఎమ్మెల్యే వెళ్లి చేరడం
బీఆర్ఎస్(BRS).. శాసనసభాపక్షాన్నివిలీనం చేసుకుంది.
రేవంత్ రెడ్డి కూడా అదే పని చేసి.. బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకుంటే ఈ లొల్లి ఉండకపోయేది.
అంటే 2/3 బీఆర్ఎస్ సభ్యులను కాంగ్రెస్ లో చేర్చుకుంటే ఫిరాయింపుల చట్టం పరిధిలోకి రాకపోతుండే.
కానీ రేవంత్ రెడ్డి(revanth reddy) హడావుడి.. ఒక్కొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను చేర్చుకున్నారు.
కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధ చర్య అయ్యింది.
కానీ ఇప్పుడొచ్చి.. కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించలేదా.? కాంగ్రెస్ ది మాత్రమే తప్పా అని చేస్తున్న ప్రచారం..
ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి తెలియని వారికి చెప్పడానికి బాగుంటుంది.
కానీ.. మేధావి వర్గం, చట్టాల గురించి తెలిసిన వాళ్లు మాత్రం రేవంత్ రెడ్డి తీరునే తప్పు పడతారు.!
కాస్త నెమ్మదిగా అయినా మరో 16 మందిని లాగేసి మొత్తంగా 26 మందిని కాంగ్రెస్ లో కలిపేసుకుంటే బీఆర్ఎల్పీ విలీనం అయ్యేది.
బీఆర్ఎస్ ను దెబ్బతీసినట్టుగా ఉండేది. చట్టబద్ధంగా ఎమ్మెల్యేలను కలుపుకున్నట్టుగానూ ఉండేది.
కానీ..ఒకరిద్దరు రాగానే హడావుడి చేసి.. ఏదో సాధించేశామని ప్రచారం చేసుకోవడం వల్ల.. ఇప్పుడు ఈ ఇబ్బందులు వచ్చాయి.
పైగా.. జాతీయ కాంగ్రెస్ పరువు కూడా పోతోంది.
ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామని మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది.
అటు జాతీయ స్థాయిలో బీజేపీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
కానీ అదే పార్టీ తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందనే అపవాదును మూటతట్టుకుంది.
అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్లు మాత్రమే ఉన్న ఈ సమయంలో బై ఎలక్షన్ లో ఏదైనా జరిగితే అధికారపార్టీకి చాలా పెద్ద అవమానమే అవుతుంది.

