Urea shortage : రాష్ట్రంలో యూరియా(urea) కొరత స్పష్టమవుతున్న నేపథ్యంలో, రైతులకు తగిన ఎరువులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala nageshwar rao)ఆదేశించారు.
మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, ఏప్రిల్ నెల నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం(narendra modi) నుంచి రాష్ట్రానికి 2.98 లక్షల టన్నుల యూరియా తక్కువగా సరఫరా అయింది. ఈ లోటు కారణంగా రైతులకు అవసరమైన యూరియా సమయానికి అందించడంలో సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు.
గ్లామర్ తో భయపెడుతున్న రష్మిక..!
రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కలెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రైతుల పంటల రక్షణ కోసం ఎరువుల పంపిణీలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని ఆయన స్పష్టంచేశారు.

