Local polls : రేపు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్….?

BREAKING NEWS-10-BATUKAMMA.COM

Local polls : బీసీ రిజర్వేషన్ల అంశం తేలే వరకు ఎన్నికలు నిర్వహించవద్దని హైకోర్టు చెప్పినా..  సర్కారు మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రేపు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే చీఫ్ ఎలక్షన్ కమిషనర్… ముఖ్యమంత్రికి డ్రాఫ్ట్ అందించారు. దానిని ఆయన పరిశీలించి మార్పులు చేసి పంపినట్టు తెలుస్తోంది.

దీంతో రేపు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నారు.

అయితే మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత పరిస్థితిని బట్టి సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీలు.. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కాబట్టి.. పార్టీ బలం ఏంటనేది కూడా దీని ద్వారా తెలిసిపోతుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే ఈ ఎన్నికల్లో స్పష్టమవుతుంది.

కాబట్టి ముందు జడ్పీటీసీ ఎన్నికలకే సర్కారు మొగ్గు చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. పార్టీ కేడర్ కు కూడా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఎన్నికలపై దిశానిర్దేశం చేసినట్టుగా చెబుతున్నారు

అయితే.. అక్టోబర్ 8న బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు మరోసారి వాదనలు విననుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా.. ఆ రోజు కోర్టు తీసుకునే నిర్ణయంపైనే ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంటుంది.

Read Also :