Dharma Mahesh : ఒరేయ్ మూర్తి నీకో దండం… నా పెళ్ళాన్ని వదిలేయ్..!

dharma Mahesh serious allegations on tv5 murthy

తెలుగు నటుడు ధర్మ మహేష్ ఇంటి వ్యవహారం రోజురోజుకి రచ్చకెక్కుతుంది. అతని భార్య, సోషల్ మీడియా ఫేమ్ గౌతమి చౌదరి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేసింది. గృహహింస చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

dharma mahesh gautamy_chowdary marriage

ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ధర్మ మహేష్ గురించి సంచలన విషయాలు బయటపడుతుంది గౌతమి. ఈ క్రమంలో ధర్మ మహేష్ కూడా ఈ రోజు ఓ టీవీ ఛానల్ కి ఇంటర్యూ ఇచ్చి సంచలన ఆరోపణలు చేశారు.

Gautamy_chowdary (3)

తన భార్య వెనుక ఉండి నడిపిస్తున్నది టీవీ5 మూర్తి అని ధర్మ మహేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే కోర్టులో విడాకుల కోసం తాను అప్లయ్ చేశామని దాని సంగతి మేము చూసుకుంటాం కానీ దయచేసి ఆమెను రెచ్చగొట్టి మమల్ని ఇలా రోడ్డు మీద పెట్టకు అని చెప్పుకొచ్చాడు.

Gautamy_chowdary (5)

తన భార్య గౌతమి బర్త్ డే రోజున నైట్ కారులో ఎవడితోనో వెళ్ళింది అని ఇలాంటివి చాలా సార్లు జరిగాయని ఇలాంటివి చూస్తూ ఇంకా ఎన్ని రోజులు భరించాలని మహేష్ ప్రశ్నించాడు. తాగి నా ఫోటో కాల్చేసింది అని చెప్పాడు.

Gautamy_chowdary (7)

ఇద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్న మాట వాస్తవం అని గుంటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర రూమ్ తీసుకొని రిలేషన్ షిప్ స్టార్ట్ చేశామని ఇప్పటికీ ఆ ఓనర్ తనకి టచ్ లోనే ఉన్నాడని మహేష్ ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు.

Gautamy_chowdary (6)

ఆయనకి అన్ని విషయాలు తెలుసు అన్నాడు. 19 ఏళ్లకే తన భార్యకి అనుకోకుండా ప్రెగ్నెన్సీ అయిందని, తాను అండగా నిలబడతాను అని చెప్పానని పరువు పోతుంది అని అబార్షన్ చేయించుకుంది అని మహేష్ ఆరోపించాడు.

Gautamy_chowdary (4)

రీతూ చౌదరితో వైరల్ అయిన వీడియో పైన కూడా ధర్మ మహేష్ క్లారిటీ ఇచ్చాడు. తను కేవలం తన ఫ్రెండ్ అని చెప్పాడు. ఎమోషనల్ గా తాను గౌతమితో తప్ప ఎవరితోనూ కనెక్ట్ కాలేదన్నాడు. టీవీ5 మూర్తి తన కెరీర్ నాశనం చేసేదాకా వదలడని, డ్రగ్స్ అంటూ లేనిపోని ఆరోపణలు ఇంకా క్రియేట్ చేస్తాడు అంటూ ధర్మ మహేష్ చెప్పుకొచ్చాడు.

Gautamy_chowdary (8)

 

Gautamy_chowdary (1)

Read Also :