Social Media Cases : రేవంత్ సర్కారుకు భారీ షాక్..!

highcourt serious comments on Social Media Cases in telangana

Social Media Cases : తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి సోషల్ మీడియా కేసులు పెరిగిపోయాయి.

సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. రైతులు తమ బాధను చెప్పుకున్నా కేసులు పెడుతున్నారు. చివరకు కరెంటు కోతలు తీవ్రమయ్యాయి అని పోస్ట్ పెట్టినా కేసు పెట్టిన సందర్భాలున్నాయి.

20 నెలల పాలనలో కొన్ని వేల సోషల్ మీడియా కేసులు నమోదయ్యాయి. కొందరిపై పదుల సంఖ్యలో కేసులు కట్టారు.

వాట్సాప్ గ్రూపుల్లో ప్రతిపక్ష పార్టీ వీడియోలు పెట్టినా, వాట్సాప్ స్టేటస్ లు పెట్టుకున్నా(Social Media Cases) కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది తెలంగాణలో.

Read Also :

ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో పెట్టిన ఒక పోస్ట్ ని రీపోస్ట్ చేశాడని అదే పార్టీకి చెందిన సోషల్ మీడియా వారియర్ శశిధర్ గౌడ్ (nallabalu)పై పోలీసులు కేసు పెట్టారు.

nallabalu

ఒకదాని తర్వాత ఒకటి కేసులు పెడుతూనే పోయారు. హైకోర్టు(high court) నాట్ టూ అరెస్ట్ ఉత్తర్వులిచ్చినా.. మరో కేసు పెట్టి జైలుకు పంపించారు.

అయితే అతనిపై సర్కారు పెట్టిన కేసుల్లో మూడింటిని హైకోర్టు క్వాష్ చేసింది. అంటే కేసులను కొట్టేసింది.

సర్కారుకు కీలక ఆదేశాలు…

కొట్టేయడమే కాదు. ఈ సందర్భంగా కోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో పెరిగిపోయిన సోషల్ మీడియా కేసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

highcourt serious comments on Social Media Cases in telangana

పొలిటికల్ సోషల్ మీడియా కేసులు నమోదు చేసేముందు పోలీసులు(Telangana Police) తగిన గైడ్‌లైన్స్ తప్పనిసరిగా పాటించాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 19(1)(a) ప్రకారం రాజకీయ విమర్శలు చేసే హక్కు ప్రతి పౌరునికి ఉందని కోర్టు స్పష్టం చేసింది.

శతృత్వాన్ని పెంచేలా మాట్లాడారని, అవమానించేలా మాట్లాడారని, బెదిరింపులకు పాల్పడ్డారని, దేశద్రోహానికి పాల్పడ్డారని కేసులు నమోదు చేసే ముందు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉందా లేదా అనేది చూసుకోవాలని కోర్టు చెప్పింది. ఎలా పడితే.. చిన్నా చితక అంశాల్లో కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడాన్ని కోర్టు తప్పు పట్టింది.

పొలిటికల్ స్పీచ్ లు ఫిర్యాదుల విషయంలో ఫిర్యాదులు రాగానే.. కేసులు నమోదు చేయకుండా దాని తీవ్రత ఏంటనేడి చూడాలని హైకోర్టు చెప్పింది.

పరువు నష్టం(defamation) ఫిర్యాదుల్లో పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ లు నమోదు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. వాటిని కోర్టులకు పంపించాలని సూచించింది.

highcourt serious comments on Social Media Cases in telangana

అలాగే, ఈ గైడ్‌లైన్స్‌ను వెంటనే డీజీపీకి(Telangana DGP) పంపించాలని హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో రేవంత్ (Revanth reddy)సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది. ఇప్పటికే నమోదైన వేలాది కేసుల విషయంలో కోర్టులు ఎలాంటి ఆదేశాలు ఇస్తాయో చూడాలి.

ఎందుకంటే చాలా కేసులు కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులతో.. సర్కారు పెట్టించినవేనని బీఆర్ఎస్(BRS Party) ఆరోపిస్తోంది.

ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్ట్ పెడితే పోలీసులే కంప్లైంట్ ఇచ్చి.. పోలీసులే ఎఫ్ఐఆర్ లు రాస్తున్నారని చెప్పింది.

హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ తో.. ఇకపై సర్కారు ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

ఎందుకంటే.. గతంలోనే ఇలాంటి చాలా కేసులకు కింది కోర్టులు రిమాండ్ రిజెక్ట్ చేశాయి. ఇప్పుడు ఏకంగా హైకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేసింది.