Zigly : భారతదేశపు మొట్టమొదటి టెక్-ఆధారిత ఓమ్నిఛానల్ పెట్ కేర్ బ్రాండ్ జిగ్లీ, జూబ్లీ హిల్స్‌లోని జిగ్లీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ప్రత్యేక వాగథాన్‌ను నిర్వహించింది. పెంపుడు జంతువులు మరియు వారి యజమానులను ఒకచోట చేర్చి ఫిట్‌నెస్, స్నేహం, ఆనందాన్ని పంచుకోవడం ఈ కార్యక్రమ లక్ష్యం.
ఉదయం 7 గంటలకు రిజిస్ట్రేషన్, కిట్ పంపిణీ జరగగా, 7:30కి ఒక కిలోమీటర్ వాక్ ప్రారంభమై తిరిగి సెంటర్ వద్ద ముగిసింది. దాదాపు 80 మంది పాల్గొన్న ఈ వేడుక హైదరాబాద్ పెట్ కమ్యూనిటీ ఉత్సాహాన్ని ప్రతిబింబించింది.
పాల్గొన్నవారికి సర్టిఫికెట్లు, పతకాలు, ట్రోఫీలు అందజేయగా, ఈవెంట్ ద్వారా రూ.1 లక్ష సేకరించి జిగ్లీ ఫౌండేషన్‌కు జంతు సంక్షేమం కోసం అందజేశారు.
కాస్మో ఫస్ట్ గ్రూప్ సీఈఓ పంకజ్ పోద్దార్ మాట్లాడుతూ, “వాగథాన్ కేవలం ఈవెంట్ కాదు, పెంపుడు జంతువులు మరియు వారి తల్లిదండ్రుల బంధానికి ఒక వేడుక” అన్నారు.
జిగ్లీ, ఫుడ్, గ్రూమింగ్, వెటర్నరీ సేవలు, యాక్సెసరీస్ వరకు అన్ని పెట్ కేర్ అవసరాలకు ఒకే గమ్యస్థానంగా నిలుస్తూ, బాధ్యతాయుతమైన పెంపుడు జంతువుల యాజమాన్యాన్ని ప్రోత్సహిస్తోంది.
Read Also : యోగా గురువుకు గట్టిగా ఆయిల్ పెట్టిన కిలేడీలు
Read Also : ఈ అందం వెనక ఇంత కథ ఉందా..?

