Hyderabad : గణేష్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ లో రెండు రోజుల పాటు పలు మార్గాలను మూసేయనున్నారు. పలు మార్గాల్లో మళ్లింపులు చేపట్టనున్నారు.
రేపు ఉదయం 6 గంటల నుండి.. ఎల్లుండి(ఆదివారం) ఉదయం 10గంటల వరకు ఆంక్షలు విధించనున్నారు. హైదరాబాద్ సిటీలోని ప్రధాన మార్గాలన్ని రేపు మూతపడనున్నాయి.
చార్మినార్, మొజంజాహీ మార్కెట్ మీదుగా హుస్సేన్ సాగర్ వరకు ఆంక్షలు ఉండనున్నాయి. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల కూడా ట్రాఫిక్ ను అనుమతించరు.
హైదరాబాద్ సిటీలో మొత్తం 303 కిలోమీటర్ల మేర గణేష్ శోభయాత్ర జరగనుంది. ఆయా మార్గాల్లో సాధారణ ట్రాఫిక్ కు అనుమతి ఉండదు.
నిమజ్జనానికి వినాయకులను తీసుకొచ్చే వాహనాలను వన్ వేలోనే అనుమతిస్తారు. నిమజ్జనం తర్వాత ఔటర్ రింగ్ రోడ్ మీదకు మళ్లిస్తారు.
నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ చెరువులు ఏర్పాటు, 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు.
Read Also :
- 15 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి
- ఎదురింటోడితో లేచిపోయిన తోటికోడళ్లు.! చివర్లో అసలు ట్విస్ట్..!
- కవితపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చే వారికి కోసం పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ టెంపుల్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుక, ఆదర్శనగర్, బీఆర్‌కే భవన్, ఖైరతాబాద్ MMTS స్టేషన్లలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
నిమజ్జనం కోసం పోలీసులు 13 కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. 30 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. షీ టీములను కూడా మోహరిస్తున్నారు.
నిమజ్జనం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు :
040-27852482, 8712660600, 9010203626
..

