Revanth reddy : 15 ఏండ్లు నేనే ముఖ్యమంత్రి..!?

Revanth reddy on cm post

Revanth reddy : ముఖ్యమంత్రి పదవి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీచర్స్ డే వేడుకల్లో పాల్గొన ఆయన.. ఈ అంశంపై మాట్లాడారు.

టీచర్లు బాగా పనిచేయాలని కోరారు. టీచర్లు బాగా పనిచేస్తే తాను కూడా కేజ్రీవాల్ లాగా మూడు సార్లు ముఖ్యమంత్రిని అవుతానని ఆయన అన్నారు.

నేనుకూడా కష్టపడతా.. మీరు కూడా కష్టపడండి.. అప్పుడు నేను రెండోసారి, మూడో సారిముఖ్యమంత్రి అవడానికి అవకాశం దొరుకుతుందని ఆయన తెలిపారు.

అయితే  ఈ కార్యక్రమంలో కూడా కేసీఆర్ పై రేవంత్ రెడ్డి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు.

తాను ఫాంహౌస్ లో పడుకోనని.. టీచర్లతో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు.

Read Also :

..