Lovers : లాడ్జిలో అరుపులు.. 15 ఏళ్ల  అమ్మాయిని ..  38ఏళ్ల అంకుల్..!

Lovers found dead in Bhadrachalam lodge 1

Lovers : భద్రాచలంలో దారుణం జరిగింది. ఓ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వారి వయస్సు వివరాలు తెలుసుకున్నాక అధికారులు కూడా షాక్ అయ్యారు.

భద్రాద్రి కొత్తగూడెం అశ్వాపురం మండలం పాములపల్లికి చెందిన అమ్మాయి(15).. రవి(38) అనే వ్యక్తితో ప్రేమలో పడింది. రవికి పెళ్లి అయ్యింది. ముగ్గురు ఆడపిల్లలు కూడా ఉన్నారు. రవి ఏపీలోని ఏలూరు జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు.

Read Also :

అదే గ్రామంలో ఉండే బంధువుల ఇంటికి అమ్మాయి తరుచూ వెళ్తూ ఉండేది. ఈ క్రమంలో అతడిపై మనసుపడింది. చాలా రోజులుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఇది తెలియడంతో అమ్మాయి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో అశ్వారావుపేట పోలీసులు ఆయనపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ కు ఇవ్వడంతో 45 రోజులు జైలులో ఉండి ఈ మధ్యే విడుదల అయ్యాడు.

బయటకు వచ్చాక కూడా పద్ధతి మార్చుకోలేదు. అమ్మాయితో కలిసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కోర్టు వాయిదాలకు కూడా హాజరు కాలేదు.

తాజాగా అమ్మాయిని తీసుకుని భద్రాచలంలోని లాడ్జికి వెళ్లాడు. అక్కడే ఇద్దరు పురుగుల మందు తాగారు. గదిలోంచి శబ్దాలు రావడంతో గమనించిన సిబ్బంది డోర్లు ఓపెన్ చేసి లోనికివెళ్లారు. అప్పటికే రవి చనిపోయాడు. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ అమ్మాయి ప్రాణాలు వదిలింది.

..