MLC Kavitha : బీఆర్ఎస్ పార్టీలో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. పార్టీ నుంచి కొందరిని బయటకు పంపేందుకు కేసీఆర్ దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీజేపీ నాయకురాలు అలూరు విజయభారతి (vijayabharathi) బీఆర్ఎస్ చేరారు. కేటీఆర్ సమక్షంలో ఆమె కండువా కప్పుకున్నారు.
విజయభారతి గతంలో బీఆర్ఎస్ లోనే ఉన్నారు. రెండేళ్ల క్రితం బీజేపీలో చేరారు. ఇప్పుడు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో(sabitha indrareddy) రాయభారం నడిపించి ఆమెను వెనక్కి తీసుకొచ్చానే చర్చ జరుగుతోంది.
అయితే ఆమె చేరిక వెనక అసలు సంగతి మాత్రం వేరే ఉందని అంటున్నారు. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలతో కవితకు కూడా చెక్ పెట్టాలని కేటీఆర్ వర్గం భావిస్తోందట. అందులో భాగంగానే విజయభారతిని వెనక్కి తీసుకొచ్చారని అంటున్నారు.
గతంలో ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాకు కవిత పెద్ద దిక్కుగా ఉండేవారు. మహిళా నాయకురాలిగా ముందుండి నడిపించారు.
ప్రస్తుతం కవిత పార్టీకి దూరంగా ఉంటున్నారు. కేవలం జాగృతి పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ లోని నాయకులపైనా ఆమె విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు.
దీంతో విజయభారతితో ఆమె స్థానాన్ని భర్తీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
ఆమె చేరికతో నిజామాబాద్ జిల్లాలో రాజకీయ పరిస్థితులు ఎలా మారబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై కవిత ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
మరోవైపు.. గతంలో ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డికి బీఆర్ఎస్(BRS) అగ్రనాయకత్వం చెక్ పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
గతంలోనే ఆయన వ్యవహారశైలిపై అధినేత కేసీఆర్ సీరియస్ అయినట్టుగా వార్తలు వచ్చాయి.
తన ఇంటి గడప తొక్కొద్దని.. గెట్ అవుట్ అంటూ వెళ్లగొట్టినట్టుగా చెబుతున్నారు.
అప్పటి నుంచి ఆయన కాస్త అటూ ఇటుగానే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
నిజామాబాద్ లో తనకు వ్యతిరేకంగా, పార్టీకివ్యతిరేకంగా పనిచేశాడని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కూడా కేసీఆర్ కు(kcr) ఫిర్యాదు చేసినట్టుగా గుసగుసలు వినిపించాయి.
దీనికి తోడు ఆయన వ్యాపకాలు, జల్సాలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయని పెద్దలు భావిస్తున్నారట.
అందుకే.. జీవన్ రెడ్డిని (Jeevan reddy) పార్టీ నుంచి పంపేందుకు పొమ్మనలేక పొగ బెడుతున్నారని తెలుస్తోంది.
Read Also :

