Highcourt : తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై ఇవాళ హైకోర్టు మరోసారి విచారణ జరపనుంది. కోర్టు ఏం చెప్పబోతోందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కల్పిస్తూ రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ కొందరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు హైకోర్టును(Highcourt) ఆశ్రయించారు. దీనిపై ఇవాళ హైకోర్టు తుది ఆదేశాలు ఇవ్వనుంది.
ఒకవేళ కోర్టు పిటిషనర్ల వాదనలతో ఏకీభవిస్తే రిజర్వేషన్లు రద్దయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే పంచాయతీ ఎన్నికలు వాయిదా పడతాయి. కొత్తగా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. దీంతో పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
అయితే… రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఉంది. మరోవైపు అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపలేదు. అయినా కూడా రేవంత్ రెడ్డి సర్కారు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని జీవో ఇచ్చింది.
ఇది ఇప్పుడు హైకోర్టుకు చేరింది. దీంతో హైకోర్టు ఇవాళ ఏం ఆర్డర్స్ ఇవ్వబోతోందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అయితే..న్యాయనిపుణులు మాత్రం.. రిజర్వేషన్ కు కోర్టు ఒప్పుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
..
Read Also :

