BUS Fire : ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో మంటలు…. ప్రయాణికులంతా

Fire in private travels bus at Hyderabad's SR nagar

BUS Fire : హైదరాబాద్ SRనగర్ లో అర్ధరాత్రి ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

బస్సు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు.

విద్యుదాఘాతం కారణంగానే మంటలు (BUS Fire)వ్యాపించాయని తెలుస్తోంది. డ్రైవర్ బస్సును నిలిపివేసి ప్రయాణీకులందరినీ సురక్షితంగా బయటకు దించారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

హైదారాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లాల్సిన ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు SR నగర్ పరిధిలో ప్రమాదం జరిగిందని చెప్పారు.

రాజమండ్రి వెళ్లాలని బస్సు బుక్ చేస్తే.. మరో బస్సు ఎక్కించారని ప్రయాణికులు వాపోయారు.

Read Also :