Defected MLAs : బీఆర్ఎస్ పార్టీ బీ ఫాంపై ఎన్నికల్లో ఎన్నికల్లో ఆ తర్వాత 10మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ(BRS) స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఆయన పట్టించుకోకపోవడంతో హైకోర్టును(high court of telangana) ఆశ్రయించింది.
అక్కడ కూడా సరైన న్యాయం జరగకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఐదారు నెలల పాటు విచారించిన సుప్రీంకోర్టు మూడు నెలల్లో అనర్హతపై తేల్చాలని స్పీకర్ కు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు.
గూడెం మహిపాల్‌రెడ్డి(పటాన్‌చెరు), అరెకపూడి గాంధీ(శేరిలింగంపల్లి), సంజయ్(జగిత్యాల), పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్సువాడ) ప్రకాశ్‌గౌడ్(రాజేంద్రనగర్), కాలె యాదయ్య(చేవెళ్ల), తెల్లం వెంకట్రావు(భద్రాచలం) బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల) ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సమాధానం ఇచ్చారు.
Read Also : బర్రెలా ఉన్నావంటూ అనసూయపై తిట్ల వర్షం..!
దానం నాగేందర్(danam nagemder), కడియం శ్రీహరి (kadiyam srihari)మాత్రం తమకు మరింత సమయం కావాలని స్పీకర్ ను కోరారు. అయితే తాము పార్టీ మారలేదనడానికి పలు ఆధారాలను, గతంలో పలు కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్ లను అందులో ఉదహరించినట్టు తెలుస్తోంది.
వీరి రిప్లైలో ఆసక్తికర అంశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ‘‘నేను పార్టీ మారలేదు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నా. నేనెక్కడా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు. అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశా…” అని స్పీకర్ కు రాసినలేఖలో చెప్పినట్టు తెలుస్తోంది.
అంతేకాదు.. తాము మర్యదపూర్వకంగా సీఎం కండువా కప్పారని.. సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పుతోంటే వద్దని చెప్పడం సంస్కారం కాదని ఆగామని చెప్పినట్టు సమాచారం. అంతేకాదు.. అది కాంగ్రెస్ కండువా కాదని.. దేవాలయాలకు సంబంధించినదని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది.
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే..తన ఇంట్లో ఇప్పటికీ కేసీఆర్ ఫొటో ఉందని, నియోజకవర్గంలో కాంగ్రెస్ పేరుతో పోస్టర్లు పెడితే వారిపైనా కేసు పెట్టానని చెప్పారట. కేటీఆర్ ను కూడా కలిసి పార్టీ మారలేదని చెప్పానని కూడా తెలిపారట.
అయితే వీరు స్పందించిన లేఖలను బీఆర్ఎస్ పార్టీకి స్పీకర్ (Speaker prasad kumar)పంపించినట్టుగా చెబుతున్నారు. అభ్యంతరాలుంటే మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని బీఆర్ఎస్ కు చెప్పారు.
Read Also :

