Breaking News : భూభారతితో రైతుల ఆత్మహత్యలు.. సీఎం సంచలన వ్యాఖ్యలు..!

BREAKING NEWS-01-BATUKAMMA.COM

Breaking News : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన చట్టం భూభారతి. గత ప్రభుత్వహయాంలో తీసుకొచ్చిన ధరణిని తొలగించి.. భూభారతిని తీసుకొచ్చారు.

ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామని.. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పదే పదే చెప్పారు. చెప్పినట్టుగానే వచ్చీరాగానే ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చారు.

అయితే.. ఇప్పుడు అదే భూభారతిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రోజున.. ల్యాండ్ సర్వేయర్లకు సర్వేయర్ లైసెన్స్ లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి… “ఈనాడు “భూభారతి” ద్వారా.. లక్షలాది సమస్యలను సృష్టించి.. ఆ సమస్యలు పరిష్కారం కాక.. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి.. అధికారులు కలవక కోర్టుల దగ్గర ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణ పేద రైతాంగానికి వచ్చింది.” అంటూ మాట్లాడారు.

అయితే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతిపై స్వయంగా రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది.

ధరణిలో తప్పిదాలు ఉన్నాయని గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దాన్ని తొలగించి భూభారతిని తీసుకొచ్చింది.

కానీ దానితో ఆత్మహత్యలు పెరిగాయని ఇంత బహిరంగంగా ముఖ్యమంతర్ చెప్పడంపై అంతా ఆశ్యర్యపోతున్నారు. మాట తూలి అలా అన్నారా.? లేకపోతే.. నిజమే చెప్పారా.? అన్న చర్చ జరుగుతోంది.

Read Also :