BIG BREAKING : బస్సు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో బస్సు చార్జీలు పెంచబోతున్నారని సమాచారం.
మొదట సిటీ బస్సులు, ఆ తర్వాత పంచాయతీ ఎలక్షన్లు పూర్తయ్యాక జిల్లాల బస్సులకు కూడా పెంచాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
హైదరాబాద్ లోని సిటీ బస్సుల్లో చార్జీల పెంపుపై ఇప్పటికే ఆర్టీసీ ప్రకటన కూడా చేసింది. కొద్దిరోజుల క్రితమే బస్సు పాసు చార్జీల భారీగా పెంచారు. ఇప్పుడు టికెట్ రేట్లు కూడా భారీగా పెంచబోతున్నారు.
సిటీ ఆర్డినరీ బస్సులో 1 నుండి 3 స్టాపుల వరకు ఇప్పుడున్న దానిపై 5 రూపాయలు పెంచబోతున్నారు.
అలాగే.. 4 స్టాపుల తరువాత ఇప్పుడున్న రేటుపై రూ.10 పెంచబోతున్నారని సమాచారం.
డీలక్స్ లేదా ఏసీ బస్సుల్లో మొదటి స్టాప్ వరకు రూ.5 పెంచనున్నారు. అలాగే రెండో స్టాప్ నుండి రూ.10 పెంచాలాని నిర్ణయం తీసుకున్నారు.
పెంచిన ధరలు అక్టోబర్ 6(సోమవారం) నుండి అమలులోకి రాబోతున్నాయి.
అయితే.. దసరా పండుగ పేరుతో ఇప్పటికే 15 రోజులుగా రెట్టింపు చార్జీలతో ప్రజల జేబులకు సర్కారు చిల్లు పెట్టింది. ఇప్పుడు సిటీ బస్సులకు రేట్లు పెంచి పేద ప్రజలపై మరింత భారం మోపబోతోంది.
మహిళలకు ఉచితం అంటూనే.. పురుషుల దగ్గర నుండి రెట్టింపు చార్జీలు వసూలు చేసేందుకు ఆర్టీసీ ప్లాన్ చేసినట్టుగా ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతోంది.
Read Also :.

