Big Breaking : తొక్కుకుంటూ పోతా.. కవిత సంచలన కామెంట్స్

BREAKING NEWS-05-BATUKAMMA.COM

Big Breaking : ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో ఎవరూ స్పేస్‌ ఇవ్వరని, తొక్కుకుంటూ వెళ్లాల్సిందేనంటూ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌లోకి వెళ్లాలన్న ఆలోచన తనకు లేదన్నారు కవిత.

హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ చేసిన కవిత.. కాంగ్రెస్‌ పెద్దలు ఎవరూ తనను సంప్రదించలేదన్నారు. సీఎం ఎందుకలా అంటున్నారో తెలియదు.. భయపడుతున్నారేమో? అని కవిత ఎద్దేవా చేశారు. ఇక కాళేశ్వరం అంశంలో తప్ప హరీశ్‌రావుపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు కవిత.

ఇరిగేషన్‌పై 2016లోనే కేటీఆర్‌కు సూచించాను. కిందిస్థాయి కమిటీ పరిశీలన, ఆమోదం లేకుండానే సీఎంకు ఫైళ్లు వెళ్లాయని చెప్పానన్నారు కవిత. రాజకీయ పార్టీ ఏర్పాటుపై తాను ఇంకా ఆలోచించలేదన్నారు.

kalvakuntla kavitha

గ‌తంలో త‌న తండ్రి పార్టీ పెట్ట‌డానికి వంద‌లాది మందితో చ‌ర్చించార‌ని ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు తాను కూడా అదే ప‌ని చేస్తున్న‌ట్టు క‌విత తెలిపారు. తండ్రి స్థాపించిన రాజ‌కీయ పార్టీ నుంచి స‌స్పెండ్ అయిన మొట్ట‌మొద‌టి కూతుర్ని తానేనని అన్నారు.

తనకు చాలామంది బీఆర్ఎస్ నాయకులు టచ్ లో ఉన్నారని చెప్పారు కవిత. తనపై బీఆర్ఎస్ సోషల్ మీడియా, ఎమ్మెల్యే హరీష్ రావు‌ సోషల్ మీడియా, సంతోష్ రావు సీక్రెట్ మీడియా దాడి చేస్తుందని ఆరోపించారు.

కృష్ణా జలాల విషయంలో రేవంత్ సర్కారు తీరుపైనా ఆమె మండిపడ్డారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు కర్నాటక సర్కారు ప్రయత్నాలు చేస్తోందన్నారు. లక్షా 30 ఎకరాల భూసేకరణ చేస్తోందని చెప్పారు. ఆల్మట్టి ఎత్తు 5 మీటర్లు పెంచి 100 టీఎంసీల నీటిని అదనంగా నిల్వ చేసుకునే ప్రయత్నాల్లో ఉందన్నారు.

అదే జరిగితే కృష్ణా నదిలో తెలంగాణ ప్రాంతం వాళ్ళు క్రికెట్ ఆడుకోవడం తప్ప చేసేది ఏం అదేని ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్మట్టిపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పిందని.. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం నుండి మాత్రం చడీ  చప్పుడు లేకపోవడం బాధాకరమన్నారు.

పాలమూరు పులిబిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు, కృష్టా నది ప్రాజెక్టులకు ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో కర్ణాటక సీఎం సిద్ద రామయ్యకు ఫోన్ చేయించి ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచకుండా ఆపించాలని ఆమె డిమాండ్ చేశారు.

అవసరం లేని వాటికి సుప్రీంకోర్టు దాకా వెళ్లే రేవంత్ రెడ్డి ఆల్మట్టిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలన్నారు. ఆయన వెళ్లకుంటే తామే జాగృతి తరపున సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ఆల్మట్టితో పాటు బనకచర్లపైనా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు.

..

Read Also :