BIG BREAKING : పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు సంచలన ఆదేశం

BREAKING NEWS-01-BATUKAMMA.COM

BIG BREAKING : పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు బ్రేక్ వేసింది. నాలుగు వారాల పాటు ఎన్నికలు నిర్వహించవద్దని ఆర్డర్స్ ఇచ్చింది.

నిన్న, ఇవాళ వాదనలు విన్న హైకోర్టు.. ఎన్నికలు వాయిదా వేయాలని చెప్పింది.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సర్కారు ఇచ్చిన జీవో సరికాదంటూ పిటిషన్లు దాఖలు కావడంతో కోర్టు ఈ నిర్ణయం వెల్లడించింది.

42 శాతం రిజర్వేషన్ ఇస్తూ జారీ చేసిన 9వ నంబర్ జీవోను హైకోర్టు తోసిపుచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని రెండు వారాల టైం ఇచ్చింది.

జీవో 9పై హైకోర్టు అభ్యంతరాలు చెప్పడంతో..  పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఆగిపోయినట్టే. ఎందుకంటే జీవో 9 ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ బాడీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.