BIG Breaking : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ తో పాటు.. ఫార్ములా రేసుకు సంబంధించిన కేసులు ఆయన మెడకు చుట్టుకున్నాయి. వాటితో బీఆర్ఎస్ పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది.
తాజాగా మరో ఇష్యూ తెరపైకి వచ్చింది. కేంద్రమంత్రి బండి సంజయ్ దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు. స్మగ్లింగ్ చేసిన కార్లు కొనుగోలు చేశారంటూ ఆయన ఆరోపించారు.
Is Car Party running on smuggled luxury cars?
Why is #TwitterTillu seen in land cruisers imported by luxury car scam-accused Basarath Khan, arrested by DRI Ahmedabad?
Why are they registered with companies linked to KCR’s family?
Were these cars bought at market price or…
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 22, 2025
బసరత్ ఖాన్ అనే వ్యక్తిని లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో డైరెక్టోరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారని అన్నారు. ఆయన దగ్గర తీసుకున్న కార్లలో కేటీఆర్ తిరుగుతున్నారంటూ బండి సంజయ్ ఆరోపించారు.
కేసీఆర్ (kcr)కుటుంబానికి లింక్ ఉన్న కంపెనీల పేరుతో ఆ కార్లు ఎందుకు రిజిస్టర్ అయ్యాయని ఆయన ప్రశ్నించారు.
అయితే.. దీనికి బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. స్మగ్లింగ్ కార్లు కొనాల్సిన అవసరం తమకు లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. బండి సంజయ్ (Bandi sanjay) తిరిగే కారు ఏ షోరూంలో కొన్నారో.. తాము కూడా అదే షోరూంలో కొన్నామని చెప్పారు.
బండి సంజయ్ ఆరోపణలకు జగదీష్ రెడ్డి కౌంటర్..
బండి సంజయ్ కార్లు ఎక్కడ కొన్నారో.. మేం కూడా అక్కడే కొన్నామన్న జగదీష్ రెడ్డి.. pic.twitter.com/qDPhp7xvDR
— PV NEWS (@pvnewstelugu) September 22, 2025
ఇక.. మాజీ కార్పొరేషన్ చైర్మన్ క్రిషాంక్.. మరో ఆసక్తికర విషయం బయటపెట్టారు. కార్లు స్మగ్లింగ్ చేస్తూ దొరికిన వ్యక్తులతో కాంగ్రెస్ వాళ్లకే సంబంధాలున్నాయని తెలిపారు. బండి సంజయ్ చెబుతున్న వ్యక్తి… స్వయంగా… రేవంత్ రెడ్డి తో.. ఆయన షాడో అయిన ఫహీం ఖురేషీతో (Fahemm khureshi) దిగిన ఫొటోలు బయటపెట్టారు.
Why do T BJP leaders target KTR and spare Revanth ❓️
If buying a Car from a Car Dealer is a Crime then MoS Home should arrest all Congress Leaders & BJP leaders who purchased Cars from this Dealer.
The Car Dealer is close to your best friend Revanth whom your agencies are… pic.twitter.com/hsxJRsTerK
— Dr.Krishank (@Krishank_BRS) September 22, 2025
అసలు నిందితులు వాళ్లేనని వారిపై చర్యలు తీసుకునే దమ్ముందా అని ప్రశ్నించారు.
దీంతో రాష్ట్రంలో రాజకీయాలు కారువైపు మళ్లాయి. బండి సంజయ్ చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ నేతలు వరుసగా కౌంటర్ ఇస్తున్నారు.
Read Also :

