Bathukamma songs : రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సందడి మొదలైపోయింది. ఆడబిడ్డలంతా పండుకు రెడీ అవుతున్నారు. ఎంగిలపూల నుండి సద్దుల బతుకమ్మ దాకా తీరొక్క పూలతో బతుకమ్మను కొలిచేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రభుత్వం కూడా బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేస్తోంది. వేడుకల తేదీలు కూడా ప్రకటించింది.
ఒకప్పుడు బతుకమ్మ పండుగ అంటే పూలు, సత్తుపిండి మాత్రమే గుర్తుకువచ్చేవి.
ఇప్పుడు బతుకమ్మ పండుగ అంటే.. ముందుగా పాటలు (Bathukamma songs)గుర్తుకు వస్తున్నాయి. పలువురు సింగర్లు, డ్యాన్సర్లు, పలు మీడియా సంస్థలు బతుకమ్మ పాటలను రూపొందిస్తున్నాయి.
ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా చాలామంది బతుకమ్మ పాటలు(Bathukamma songs 2025) విడుదల చేశారు. మీ కోసం అవన్నీ ఒకే దగ్గరకు తీసుకొచ్చాం.
ఫోన్ సాంగ్స్ కి డ్యాన్స్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తున్న నాగ దుర్గ(nagadurga).. ఈ సారి రెండు మూడు బతుకమ్మ పాటలు చేశారు. టీ న్యూస్ ఛానల్ తో పాటు పలు ఫోన్ ఛానల్స్ కి ఆమె సాంగ్ చేశారు.
సింగర్ మంగ్లీ(singer mangli) కూడా ఈ సారి బతుకమ్మ సాంగ్ చేశారు. స్పీకర్ ఛానల్ కోసం ఆమె సాంగ్ చేశారు.
యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయిన మౌని యాదవ్(mouni yadav) కూడా ఈ ఏడాది బతుకమ్మ పాట చేశారు. మిస్టర్ మల్లికార్జున్ ఛానల్ ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చిన ఆమె.. ఇప్పుడు సొంతగా ఛానల్ పెట్టారు. తాను జానపద గాయని కూడా.
ఫోన్ టూ పాప్ .. ఏ సాంగ్ తో అయినా అదరగొట్టే సింగర్ వరం (Singer varam)సాంగ్ కూడా ఆకట్టుకుంటోంది.
ఇక.. విమలక్క (Vimalakka)బహుజన బతుకమ్మ పేరుతో పాటవిడుదల చేశారు.
ఇంకెందుకు ఆలస్యం.. ఈ పాటలతో ఈ సారి బతుకమ్మను ఫుల్లుగా ఎంజాయ్ చేయండి.
Read Also :

