Alcohol : శుభమైన ఆశుభమైన తెలుగు రాష్ట్రాల్లో మందు తాగడం అనేది కామన్… యూత్ బీర్లు బీజర్లు తాగితే, పెద్దవాళ్లు మందు, విస్కీ అలా తాగుతుంటారు. ఇక యూత్ అయితే లైట్ బీర్ స్ట్రాంగ్ బీర్లకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు. నలుగురు కూర్చుంటే, నలుగురు కలిస్తే బీర్లు వేస్తూ మాట్లాడుకుంటారు.
చాలామంది యూత్ లో ఓ సందేహం ఉంటుంది. లైట్ బీరు మంచిదా లేకపోతే స్ట్రాంగ్ బీర్ మంచిదా అని. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం అనేది ఆరోగ్యానికి హానికరం. కానీ లైట్ బీర్, స్ట్రాంగ్ బీర్ లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి వస్తే, లైట్ బీర్ తాగడం కొంచెం మంచిది.
లైట్ బీర్ లో ఆల్కహాల్ శాతం (Alcohol By Volume – ABV) తక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా 4-5% మధ్య ఉంటుంది, అయితే స్ట్రాంగ్ బీర్ లో ఇది 5% లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
Read Also :
- రేవంత్ సర్కారుకు హైకోర్టు షాక్..!
- ఏడు కొండల వాడా.. ఏంటీ ఈ పంచాయితీ..?
- జూమ్ కరో మ్యాజిక్ దేఖో..!
- TDPలోకి కేసీఆర్ కూతురు..?
- కేటీఆర్ ను ఇరికించబోయి ఇరుక్కున్న రేవంత్ రెడ్డి..?
లైట్ బీర్ లో కేలరీలు (calories) తక్కువగా ఉంటాయి. మీరు బరువు పెరగకూడదని అనుకుంటే, లైట్ బీర్ మంచి ఎంపిక.
స్ట్రాంగ్ బీర్ లో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా 5% ABV లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. కొన్ని రకాల స్ట్రాంగ్ బీర్లలో ఇది 8% కంటే కూడా ఎక్కువగా ఉండొచ్చు. ఇందులో ఆల్కహాల్ ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ మత్తు వస్తుంది.
మితంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.బీర్ లో ఉండే డైటరీ సిలికాన్ (dietary silicon) ఎముకల బలానికి తోడ్పడుతుంది.బీర్ అనేది ఆరోగ్య పానీయం కాదు. ఇది కేవలం సరదా కోసం, మితంగా తీసుకోవాలి.

