Time Restricted Eating  : ఉపవాసం ఇలా చేస్తే మీ గుండెకు డేంజర్..!

Time Restricted Eating

Time Restricted Eating  : బరువు తగ్గేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా అనుసరిస్తున్న టైమ్‌-రిస్ట్రిక్టెడ్‌ ఈటింగ్ (TRE) పద్ధతి గుండెకు ముప్పు కలిగించే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరించింది.

Diabetes & Metabolic Syndrome: Clinical Research & Reviews జర్నల్‌లో ఈ నివేదిక ప్రచురితమైంది. ఈ నివేదిక ప్రకారం, రోజుకు కేవలం 8 గంటల వ్యవధిలో మాత్రమే ఆహారం తీసుకోవడం, మిగిలిన 16 గంటలు ఉపవాసంగా గడపడం వలన హృదయ సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

అమెరికా నేషనల్‌ హెల్త్‌ అండ్‌ న్యూట్రిషన్‌ ఎగ్జామినేషన్‌ సర్వే (NHANES)లో ఈ విషయం వెల్లడైంది. ఇందులో పాల్గొన్న సుమారు 19,000 మందిపై పరిశోధకులు సేకరించిన డేటా ఆధారంగా ఈ అధ్యయనం చేపట్టారు.

ఫలితాల్లో, రోజుకు8 గంటల వ్యవధిలో ఆహారం తీసుకున్నవారికి హృద్రోగ మరణాల ప్రమాదం 91% ఎక్కువగా ఉందని తేలింది.

TRE - time restricted eating

ఈ తరహా ఆహారపు పద్ధతులు పాటించే వారిని జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయ లేదా మతపరమైన ఉపవాసాలు ఆరోగ్య పరంగా సులభతరంగా ఉండటమే కాకుండా మెరుగైన ఫలితాలను ఇస్తాయని ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్‌ అనూప్‌ మిశ్రా తెలిపారు.

మధుమేహం ఉన్నవారికి Time Restricted Eating  విధానం రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా తగ్గే ప్రమాదం ఉండవచ్చని, వృద్ధులకు కండరాల బలహీనత వచ్చే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు.

అయితే, ఇతర పరిశోధనలు మాత్రం విభిన్న ఫలితాలను సూచిస్తున్నాయి. Annals of Internal Medicineలో ప్రచురితమైన “TIMET Study”లో ప్రతిరోజు 10 గంటల ఆహార విండో పాటించినవారిలో రక్త చక్కెర, కొలెస్ట్రాల్, BMI మరియు పొట్టకొవ్వు స్థాయిల్లో గణనీయమైన మెరుగుదల కనిపించిందని తేలింది.

మెటా-విశ్లేషణల ప్రకారం కూడా, TRE కొంతమేరకు బరువు, ట్రైగ్లిసరైడ్లు, LDL కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే రక్తపోటు, HbA1c లాంటి ఇతర మెటబాలిక్‌ ప్రమాణాల్లో మాత్రం పెద్ద మార్పులు కనిపించలేదని పరిశోధకులు చెబుతున్నారు.

వివిధ అధ్యయనాల ఫలితాలు పరస్పర విరుద్ధంగా ఉండటంతో, ప్రతి ఒక్కరూ స్వయంగా TRE పద్ధతిని అనుసరించకూడదని డాక్టర్లు చెబుతున్నారు.

ప్రత్యేకించి మధుమేహం, వృద్ధాప్యం, గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also :