పాప్ సెన్సేషన్ టేలర్ స్విఫ్ట్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. అమెరికన్ ఫుట్‌బాల్ స్టార్ ట్రావిస్ కెల్స్‌తో ఆమె నిశ్చితార్థం జరిగింది.
ఈ జంట తమ జీవితంలో కొత్త ఆరంభాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోతో ప్రకటించింది. స్విఫ్టీస్ అంతా ఆనందంలో మునిగిపోయారు.
నిశ్చితార్థ వేడుకలోని ప్రతి చిన్న క్షణాన్ని అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అద్భుతమైన రింగ్
స్విఫ్ట్ ధరించిన వింటేజ్ రింగ్ అందరినీ ఆకర్షిస్తోంది. ఆర్టిఫెక్స్ ఫైన్ జ్యువెలరీకి చెందిన కిండ్రెడ్ లూబెక్‌తో కలిసి కెల్స్ ప్రత్యేకంగా ఈ రింగ్‌ను డిజైన్ చేశారు.
యెల్లో గోల్డ్‌లో తయారైన ఈ రింగ్‌లో కోణాలు రౌండ్‌గా ఉండే ఓల్డ్ మైన్ బ్రిలియంట్ కట్ డైమండ్‌ను బిజెల్ సెట్‌లో అమర్చారు. బ్యాండ్ పక్క భాగంలో అద్భుతమైన ఎంగ్రేవింగ్ కూడా ఉంది.
ఓల్డ్ మైన్ డైమండ్స్ 18వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం చివరి వరకు చేతితో కట్ చేయబడిన అరుదైన రాళ్లు.
ఇవి ప్రధానంగా బ్రెజిల్, భారతదేశంలోని పాత గనుల నుండి లభించేవి. అంటే టేలర్ స్విఫ్ట్ వేల్లో మెరిసిపోతున్న వజ్రం మన భారతదేశం నుంచే వచ్చి ఉండే అవకాశం ఉంది.
డ్రెస్ & యాక్సెసరీస్
ఈ ప్రత్యేక వేడుకలో టేలర్ సింపుల్‌గా, స్టైలిష్‌గా కనిపించారు. ఆమె ధరించిన బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్డ్ హాల్టర్ డ్రెస్ (పోలో రాల్ఫ్ లారెన్) సిల్క్ మిశ్రమంతో తయారై, రూ.35,000 (USD 400) విలువగలదని సమాచారం. బ్రౌన్ లూయిస్ విట్టన్ హీల్డ్ శాండల్స్‌తో లుక్‌ను పూర్తి చేశారు.
అయితే మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఆమె వాచ్.
టేలర్ గోల్డ్ కార్టియర్ సాంటోస్ డెమోయిజెల్ క్వార్ట్జ్ వాచ్‌ను ధరించారు.
డైమండ్ స్టడెడ్ ఈ వాచ్‌ను గత సంవత్సరం క్రిస్మస్ సీజన్‌లో ఆమె తొలిసారిగా ధరించినట్లు గమనించారు.

టేలర్ స్విఫ్ట్, ట్రావిస్ కెల్స్ లవ్ స్టోరీ 2023 మధ్యలో మొదలైంది.
అప్పట్లో కెల్స్ తన అభిమానాన్ని బహిరంగంగా వ్యక్తం చేయగా, ఆ తర్వాత ఇద్దరూ పబ్లిక్‌గా కలిసి కనిపించడం ప్రారంభమైంది.
టేలర్ తరచూ కెల్స్ మ్యాచ్‌లకు హాజరవుతూ, ఇద్దరూ అనేక సందర్భాల్లో కలిసి కనిపించడం అభిమానులను ఆనందపరిచింది.

