Rahul Gandhi Marriage : కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ బ్రేకింగ్ న్యూస్ చెప్పారు. తన పెళ్లి గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి.
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ త్వరలో పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ తన పెళ్లి (Rahul Gandhi Marriage)విషయాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
“ఇది నా విషయంలో కూడా వర్తిస్తుంది. నేను లాలూజీతో సంప్రదింపులు జరుపుతున్నాను… ఆయనే నాకు సంబంధం చూస్తారు” అని రాహుల్ గాంధీ నవ్వుతూ చెప్పారు. దీంతో అక్కడున్న నాయకులు అంతా ఫక్కున నవ్వారు.

దీనిపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.
రాహుల్ గాంధీ పెళ్లి వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. “🔥😂 RaGa to get married soon?” అంటూ నెటిజన్లు మీమ్స్ షేర్ చేస్తున్నారు.
కొందరు “లాలు జీ పెళ్లి బ్రోకర్‌గా కొత్త కెరీర్ మొదలుపెడుతున్నారా?” అని వ్యంగ్యంగా రాశారు.
మరికొందరు “2025లో బిగ్ ఫ్యాట్ ఇండియన్ పొలిటికల్ వెడ్డింగ్!” అంటూ హ్యాష్‌ట్యాగులు (#RaGaWedding, #LaluJiShaadiPlanner) ట్రెండ్ చేస్తున్నారు.
ఇంకొకరు “ముందుగా భారత్ జోడో, ఇప్పుడు శాదీ జోడో! 🔥” అంటూ జోక్ చేశారు.
“చిరాగ్ – తేజస్వి – రాహుల్ కలిసి పెళ్లి పీటలెక్కితే… బీహార్ పాలిటిక్స్ కన్నా బీహార్ బారతీలు ఎక్కువగా ఉంటారు” అని ఒక యూజర్ కామెంట్ పెట్టారు.
“లాలు జీ పెళ్లి కూతురిని ఫైనల్ చేస్తారా లేక కాంగ్రెస్స్ హైకమాండ్ ఫైనల్ చేస్తుందా?” అంటూ రాజకీయ కోణంలో కూడా సరదా చర్చలు సాగుతున్నాయి.
ఇంకొందరు “రాహుల్ పెళ్లి = బీహార్ + ఢిల్లీ కలయిక” అంటూ మామూలు సీరియల్ ప్రోమోలా ట్వీట్లు చేస్తున్నారు.
రాహుల్ గాంధీ పెళ్లి ఎప్పుడన్న ప్రశ్న అనేక సంవత్సరాలుగా తరచుగా వస్తూనే ఉంది. ఈసారి ఆయన స్వయంగా లాలు ప్రసాద్ యాదవ్ పేరును ప్రస్తావించడంతో, ఇది నిజంగా జరుగుతుందా లేక మామూలు హాస్య వ్యాఖ్యలుగానే మిగిలిపోతుందా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
రాహుల్ గాంధీ వయస్సు 52 ఏళ్లు. ఆయన ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ప్రతీ సందర్భంలో ఆయన పెళ్లి గురించి చర్చ వస్తూనే ఉంటుంది. ఆయన దానిని దాటవేస్తూ ఉంటారు.
అయితే.. ఆల్రెడీ రాహుల్ గాంధీకి పెళ్లి అయ్యిందని.. ఆయన భార్య విదేశాలలో ఉంటారనే ప్రచారం కూడా ఉంది. అందుకే అప్పుడప్పుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లి వస్తారని అంటుంటారు.
Read Also :

