BIG BREAKING : ఈవీఎం హ్యాకింగ్ చేసినం..! బీజేపీ సీఎం సంచలన వ్యాఖ్యలు..!

delhi cm rekha gupta sensational comments

BIG BREAKING : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దేశంలో ఈవీఎంలపై పెద్ద రగడ నడుస్తోంది. ఎలక్టానిక్ ఓటింగ్ మెషిన్లను బీజేపీ హ్యాక్ చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి.

అన్ని ఎన్నికల్లో బీబేపీ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి, హ్యాకింగ్ చేసి గెలుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. కానీ ఈవీఎంల(EVM) హ్యాకింగ్ కు అవకాశం లేదని కోర్టు చెప్పింది.

కానీ టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ మాత్రం హ్యాకింగ్ సాధ్యమేనని చెబుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలన్ని కూడా పేపర్ బ్యాలెట్ తోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు రేఖా గుప్తా(Rekha Gupta) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎం హ్యాకింగ్ చేసి ఎన్నికల్లో గెలిస్తే తప్పేంటని ఆమె మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లుగా ఈవీఎంలను మేనేజ్ చేసి గెలుస్తోంది. మేము ఇప్పుడు చేస్తే తప్పా అని ఆమె ప్రశ్నించారు.

“70 ఏళ్లుగా వాళ్లు చేస్తే రైటు.. మేం చేస్తే తప్పా..? వాళ్లు గెలిస్తే ప్రజాతీర్పు?.. మేం గెలిస్తే ఈవీఎం హ్యాకింగా?.. ఈ ఫార్ములా ఏ పుస్తకంలో ఉందో ఎవరైనా చెబుతారా?.. రాహుల్‌ ఈ విషయాన్ని ఎక్కడ చదువుకున్నారు?”

అంటూ ఆమె మాట్లాడారు.

ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఓ వైపు రాహుల్ గాంధీ(Rahul gandhi).. ఓట్ చోరీ పేరుతో క్యాంపెయిన్ చేస్తున్నారు. బీజేపీ దొంగ ఓట్లతో గెలుస్తోందని సాక్ష్యాలు బయటపెడుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు దీనిపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు.

ఓటరు కార్డు నంబర్లతో సహా దొంగ ఓట్ల లెక్కలు, అక్రమంగా తొలగించిన ఓటర్ల వివరాలను బయటపెట్టారు. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి ఏకంగా తాము ఈవీఎం హ్యాకింగ్ చేస్తే తప్పా అని ప్రశ్నించారు.

దీంతో అసలు దేశంలో ఓటింగ్ వ్యవస్థపై, ఎలక్షన్ కమిషన్ పనితీరుపై అనేక అనుమానాలు వస్తున్నాయి. వాళ్లే ఓట్లు వేసుకుని.. వాళ్లే ఈవీఎంలు హ్యాకింగ్ చేసుకుని ఎన్నికల్లో గెలిస్తే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు.? రాజ్యాంగం ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Read Also :