Malnutrition : ఐఐటీ, ఎయిమ్స్ జోధ్‌పూర్ శాస్త్రవేత్తలు పిల్లల పోషకాహార లోపాన్ని గుర్తించడానికి కొత్త కృత్రిమ మేధస్సు (AI) పద్ధతిని తయారు చేశారు.
ఇప్పటివరకు పిల్లల ఎత్తు, బరువు, చేతి చుట్టుకొలత (MUAC) కొలిచి పోషక స్థితి చెబుతారు. ఇది సమయం తీసుకునే పని. కానీ కొత్త AI పద్ధతిలో పిల్ల ఫోటో తీస్తే చాలు, ఆ ఫోటో ద్వారా స్టంటింగ్, వేష్టింగ్, అండర్వెయిట్ వంటి సమస్యలు ఉన్నాయో లేదో చెప్పగలదు.
ఈ పరిశోధన కోసం 16,938 ఫోటోలు, 2,141 మంది పిల్లల నుంచి సేకరించారు. వేర్వేరు చోట్ల, వేర్వేరు పరిస్థితుల్లో తీసిన ఈ ఫోటోలతో “అంత్రోవిజన్” అనే పెద్ద డేటాసెట్ తయారైంది.
“ఈ టెక్నాలజీ వలన పిల్లల పోషకాహార లోపం త్వరగా, సులభంగా, తక్కువ ఖర్చుతో గుర్తించవచ్చు. గ్రామాలు, పాఠశాలలు, ఆసుపత్రులలో ఎక్కడైనా ఉపయోగించవచ్చు,” అని పరిశోధనకు నాయకత్వం వహించిన మిసాల్ ఖాన్ చెప్పారు.
ఈ కొత్త పద్ధతి పాత పద్ధతుల కంటే మంచి ఫలితాలు ఇచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
Read Also :

