Udaya Bhanu : 90s కిడ్స్ హాట్ ఫేవరేట్ యాంకర్ ఉదయభాను. వన్స్ మోర్ ప్లీజ్ తో తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలను దోచుకుంది. యాంకరింగ్ లో చెరగని ముద్ర వేసింది.
టీవీలో ఉదయభాను (Udaya Bhanu)కనిపించిందంటే పనులన్నీ పక్కనపెట్టి చూసేవారు చాలామంది ఉండేవారు. రెండు దశాబ్దాల పాటు టెలివిజన్ రంగంలో ఊపు ఊపు వదిలిపెట్టింది.
ఒకట్రెండు సినిమాల్లో నటించినా.. పూర్తిస్థాయిలో సినిమాల్లోకి మాత్రం రాణించలేదు. తర్వాత కుకింగ్ ప్రోగ్రామ్స్ తో ఆకట్టుకుంది.
ఏజ్ బార్ అయ్యిందని విమర్శలు వచ్చినా.. అప్పట్లో ఒక ఐటమ్ సాంగ్ చేసి కుర్రకారులో హుషారు నింపింది. లీడర్ సినిమా(Leader Movie) మొత్తం ఒక ఎత్తు అయితే.. అందులో రాజశేఖరా అంటూ ఉదయభాను చేసిన డ్యాన్స్ మరో ఎత్తు.
దీని ద్వారా తాను అన్ని రకాల పాత్రలు చేయగలనని నిరూపించింది.
ఇప్పుడు మరోసారి తనలోని టాలెంట్ ను బయటపెట్టింది. ఇస్కితడి.. ఉస్కితడి.. అంటూ స్టెప్పులేసి.. వారెవ్వా అనిపించింది.
త్రిబాణాధారి బార్బారిక్(Tribanadhari Barbarik) సినిమా కోసం ఉదయభాను ఈ సాంగ్ చేసింది. రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) పాటకు, ఉదయభాను ఆట తోడు కావడంతో యూట్యూబ్ షేక్ అవుతోంది. ఎక్కడ చూసినా ఇదే సాంగ్ వినిపిస్తోంది.
ఈ మూవీలో పద్మక్క పాత్రలో ఆమె నటిస్తోంది.
లాంగ్ గ్యాప్ తర్వాత ఉదయబానును (Udaya Bhanu)చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. శ్రీదేవి మళ్లీ వచ్చినట్టుగా ఉందని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఈ ఏజ్ లో కూడా మాస్ ఎనర్జీతో అదరగొట్టారని కామెంట్లు పెడుతున్నారు.
వెల్కం బ్యాక్ ఉదయభాను.. మీరు సినిమాల్లో బిజీ కావాలని కోరుతున్నారు.

