Jun Hyun : జున్ హ్యూన్ జీ దక్షిణ కొరియాలో జన్మించింది. చిన్నప్పటి నుంచే ఆమెకు నృత్యం, పాటలు, నటన అంటే ఇష్టం. మొదట మోడల్‌గా తన ప్రయాణం మొదలుపెట్టింది. ఆమె అందం, ధైర్యం చూసి కొంతమంది దర్శకులు సినిమాల్లో అవకాశం ఇచ్చారు.
కొన్ని చిన్న పాత్రల తర్వాత ఆమె చేసిన “మై సాస్సీ గర్ల్” సినిమా ఆమెకు పెద్ద పేరు తెచ్చింది. ఆ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. తరువాత “ది థీవ్స్, బెర్లిన్ ఫైల్, అసాసినేషన్” వంటి యాక్షన్ సినిమాల్లో కూడా నటించి తన ప్రతిభను నిరూపించింది. టీవీ డ్రామాలు “మై లవ్ ఫ్రమ్ ది స్టార్, లెజెండ్ ఆఫ్ ది బ్లూ సీ, కింగ్డమ్” లో నటించి కోట్లాది అభిమానులను సంపాదించింది.
జున్ హ్యూన్ జీ ప్రత్యేకత ఏమిటంటే ఆమె ఒకే రకం పాత్రల్లో కాకుండా, ప్రతి సినిమాలో కొత్తగా కనిపించడం. రొమాన్స్, కామెడీ, యాక్షన్, ఫాంటసీ—ఎలాంటి కథ అయినా ఆమె సహజంగా నటిస్తుంది. అందుకే ఆమెను అభిమానులు చాలా ఇష్టపడతారు.
ఇప్పుడు ఆమె కొత్తగా తెలుగు సినిమాల్లోకి అడుగుపెడుతోంది. ఇది ఆమెకు ఒక కొత్త ఆరంభం. భారతీయ సంస్కృతి నేర్చుకోవాలని, తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందాలని ఆమె ఆశిస్తోంది.
దర్శకుడు ఎస్.వి. కృష్ణరెడ్డి తీస్తున్న 43వ సినిమా “వేదవ్యాస్”. ఇది కుటుంబ కథతో పాటు ఉత్కంఠ, వినోదం, మంచి సందేశం కలిపిన సినిమా.
జున్ హ్యూన్ జీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఆమెతో పాటు మురళి మోహన్, సుమన్, సాయి కుమార్, మురళి శర్మ, రఘు బాబు, ప్రుధ్వి కూడా నటిస్తున్నారు. విలన్‌గా ఒక మంగోలియా నటుడు పరిచయం అవుతున్నాడు

