Actor Rahul Ramakrishna: నటుడు రాహుల్ రామకృష్ణ మరో సంచలన పోస్ట్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ ను టాగ్ చేస్తూ ఆయన రెండు రోజుల క్రితం ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ సోషల్ మీడియా మొత్తం ఆయనపై ఎటాక్ చేసింది.
కొందరు ప్రభుత్వ పెద్దలు, పోలీసు అధికారులు ఆయనకు ఫోన్ చేసి బెదిరించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి.
దీంతో రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ట్వీట్లు డిలీట్ చేశారు. అలాగే తన ఎక్స్ అకౌంట్ ని డీయాక్టివేట్ చేసుకుని వెళ్లిపోయారు.
కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం.. మూడు పార్టీలకు చెందిన సోషల్ మీడియా మొత్తం ఆయన వెంటపడింది. బూతులతో రెచ్చిపోయింది. ఆ బెదిరింపులు తట్టుకోలేకనే అకౌంట్ డీయాక్టివేట్ చేసినట్టు తెలిసింది.
అయితే శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ఆయన ఎక్స్ అకౌంట్ రీయాక్టివేట్ అయ్యింది. అందులో ఇవాళ ఆయన మరో సంచలన పోస్ట్ పెట్టారు.

“నా కంటే పెద్ద పెద్ద మేధావులు చాలాకాలంగా సామాజిక సమస్యలతో పోరాడుతున్నారు. పాలన, పరిపాలన గురించి నాకు ఎంత తెలుసు? నేను ఒక చిన్న నటుడినే.
అన్ని రాజకీయ పక్షాలకి చెందిన అనుభవజ్ఞులైన నేతలతో చేసిన ఎన్నో సుదీర్ఘ ఫోన్ సంభాషణల తర్వాత, నా కోపం, అసహనం తప్పు దిశలో ఉన్నాయని గ్రహించాను. ఎవరు పాలించినా, ఏ విధంగా వ్యవస్థ నడిచినా, నా దేశం, నా ప్రజల భవిష్యత్తు మంచిదే కావాలని నేను కోరుకుంటాను. విమర్శలతోనే ఆగిపోకుండా, వ్యవస్థతో కలిసి నడవడం నా కర్తవ్యమని భావిస్తున్నాను.
మరి నేను ఉన్న కొద్ది నైపుణ్యాలతో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పూర్తిగా అంకితం అయ్యే సమయం వచ్చే వరకు, ఈ ట్విట్టర్ యాక్టివిజం నుంచి తప్పుకుంటున్నాను.
ఇకపై నా వంతు కృషి అంతా తెరపై మంచి పనుల రూపంలో మాత్రమే మీ ముందుకు వస్తుంది.”
అంటూ ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు.
ఆయన మాటలను బట్టి.. కాంగ్రెస్ లోని కొందరు నాయకుల నుండి కూడా బెదిరింపులు వచ్చినట్టుగా తెలుస్తోంది.
అయితే.. ఇంత జరిగిన తర్వాత కూడా.. ఆయన తన స్టాండ్ మార్చుకోలేదు. ఈ దేశం కోసం, తన ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటానని అందులో రాసుకొచ్చారు.
..
Read Also :.

