Pawan kalyan : పోటెత్తిన మూసీ.. స్పందించిన పవర్ స్టార్..!

pawan-kalyan-on hyderabad rains

Pawan kalyan : హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూసీ పోటెత్తడంతో వందలాది ఇండ్లు నీట మునిగాయి.

జంట జలాశయాల నుండి నీటి విడుదలతో ఉధృతి మరింత పెరిగింది.

ఈ నేపథ్యంలో జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. వరద బాధితులకు అండగా ఉండాలని జనసేన కార్యకర్తలను పిలుపునిచ్చారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే వరద  సహాయక చర్యలు మొదలుపెట్టిందని ఆయన తెలిపారు.

ప్రభుత్వ సూచనలను, వాతావరణ హెచ్చరికలను ప్రజలు అనుసరించాలని సూచించారు.

వరద బాధితులకు ధైర్యం చెప్పి, వారికి అవసరమైన ఆహార అందించాలని జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

 

Read Also :