Kavitha : బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైన కవిత ఏ పార్టీలోకి వెళ్లబోతున్నారు.? కొత్తగా పార్టీ పెడతారా..? అన్న ఊహాగానాలు జోరుగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారాలోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కవితను (Kalvakuntla kavitha) తెలంగాణ టీడీపీలోకి తీసుకోవడం అంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీడీపీలో చేర్చుకున్నట్టే అని వ్యాఖ్యానించారు. మీడియాతో చిట్ చాట్ సందర్బంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు.
అలాగే కేటీఆర్ ను కలవడంపైనా మాట్లాడారు. కేటీఆర్ ను కలవాలంటే రేవంత్ రెడ్డి పర్మీషన్ తీసుకోవాలా అని ప్రశ్నించారు. గతంలో చాలా సార్లు కేటీఆర్ ను కలిసినట్టు చెప్పారు. ఇకపైనా అవసరం ఉంటే తప్పకుండా కలుస్తానని చెప్పుకొచ్చారు.
కేటీఆర్ ను ఎందుకు కలవకూడదని ఎదురు ప్రశ్నించారు.
ఇక.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీపైనా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
Read Also :

