Chandra babu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడులో ఆయన పర్యటించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రసంగించారు.
తాను 2014 సీఎంను కాదని.. 1995 నాటి సీఎంనని చంద్రబాబు చెప్పారు. చెత్తకు..గత ప్రభుత్వానికి లింక్ పెట్టి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
గత ప్రభుత్వం చెత్త మీద పన్ను వేసింది కానీ చెత్తను తొలగించలేదన్నారు. తాను చెత్తతో పాటు చెత్త రాజకీయాలను కూడా కడిగి పారేస్తానని చంద్రబాబు(Chandra babu) చెప్పారు. మాచర్లలో చాలాకాలం పాటు ప్రజాస్వామ్యం అనేదే లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు నేతలు రౌడీయిజంతో విధ్వంసం చేశారన్నారు.
గతంలో మాచర్లలో చాలా అరాచకాలు చేశారు. వారందరికీ జాగ్రత్తగా ఉండాలని పల్నాడు గడ్డ పై నుంచి హెచ్చరిస్తున్నా..#SwarnaAndhraSwachhAndhra#MyCleanAP#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/FQNRkSzVQK
— Telugu Desam Party (@JaiTDP) September 20, 2025
రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేశానని కానీ.. గత ప్రభుత్వం వల్ల మాచర్లలో మాత్రం పరిస్థితి మారలేదన్నారు. మాచర్లలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలపై దాడి జరిగిందని గుర్తుచేశారు.
నియంతలకు పట్టిన గతే మాచర్లలో రౌడీయిజం చేస్తున్న వారికి పడుతుందని హెచ్చరించారు. పల్నాడులో రౌడీయిజాన్ని పూర్తిగా అణచివేస్తానని చెప్పారు.
ఇప్పుడు మాచర్లకు స్వాతంత్ర్యం వచ్చిందని బాబు అన్నారు. అందరిలోనూ సంతోషం కనిపిస్తోందనని.. ఇది చూసిన తనకు కూడా ఆనందం కలుగుతోందన్నారు. శాశ్వతంగా ఇదే పరిస్థితి కొనసాగాలన్నారు.
Read Also :
- తొక్కుకుంటూ పోతా.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
- నేను బతుకుతానో లేదో… డీజే టిల్లు సంచలన పోస్ట్..!
- ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్న OG వీడియో
- భారత్ కు భారీ దెబ్బకొట్టిన ట్రంప్
- ట్రెండింగ్ తాతకు షాకిచ్చిన మంచు లక్ష్మి..!

