Beerla Ilaiah : నల్లగొండ జిల్లా రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. జిల్లాకు చెందిన లీడర్ల మధ్య అసలే పొసగడం లేదు.
సొంత అన్నాదమ్ములైన రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి మధ్య మంత్రి పదవి విషయంలో దూరం పెరిగింది. రాజ్ గోపాల్ రెడ్డి ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారు.
ఇదే సమయంలో మరో ఇద్దరి మధ్య అగ్గి రాజుకుంది. బీర్ల అయిలయ్య, మందుల సామేల్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మదర్ డెయిరీ ఎన్నికల నేపథ్యంలో ఈ వార్ మొదలైంది.
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై (beerla ilaiah) మందుల సామేల్(Mandula Samuel) సంచలన వ్యాఖ్యలు చేశారు. బంధుత్వాల కోసం కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు.
మదర్ డెయిరీ ఎన్నికల్లో.. కొందరు బీఆర్ఎస్ నాయకులతో బీర్ల అయిలయ్య పొత్తు పెట్టుకున్నాడని మందుల సామేల్ ఆరోపించారు. బుంధుత్వం కోసం పార్టీని బొంద పెట్టొద్దని అన్నారు.
లఫంగి రాజకీయాలు మానెయ్యాలని.. రాజకీయ వ్యభిచారం చేయొద్దని సూచించారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నైతికంగా బాధ్యత వహిస్తూ బీర్ల ఐలయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే.. కార్యకర్తలే బీర్ల అయిలయ్యకు బుద్ధి చెబుతారని మందుల సామేల్ హెచ్చరించారు.
Read Also :

