Sujith : ఓజీ సెన్సేషన్.. సుజీత్ ఎవరు.?

Interesting facts about OG director sujith

Sujith : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంతా OG సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఓజీ మానియా కొనసాగుతోంది.

బుధవారం రాత్రి నుంచే థియేటర్లలో పవన్ ఫ్యాన్స్ హడావుడి మొదలైంది. చాలా కాలం తర్వాత పవర్ స్టార్ నుంచి వచ్చిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ మూవీలో ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ కీలక రోల్స్. థమన్ మ్యూజిక్ అదిరిపోయింది.

అయితే.. ఇప్పుడు మూవీ డైరెక్టర్ గురించి అంతా గూగుల్ చేస్తున్నారు. సుజీత్ (Sujith)ఎవరు..?

అచ్చ తెలుగు అబ్బాయి. ఏపీలోని అనంతపురంలో పుట్టాడు. చెన్నైలో ఫిల్మ్ కోర్స్ చేశాడు. 17 ఏళ్లకే షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ అవ్వాలనుకున్నాడు.. కానీ అవకాశం రాలేదు. సొంతంగా 30 షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. ఓ కాంటెస్ట్‌లో ‘రన్ రాజా రన్’ షార్ట్ ఫిల్మ్‌తో విన్నర్ అయ్యాడు.

Interesting facts about OG director sujith

యూవీ క్రియేషన్స్ నుంచి ఆఫర్ వచ్చింది. మొదట లవ్ స్టోరీ చెప్పాడు. రిజెక్ట్ అయింది. బాధతో ఇంటికి వెళ్తుండగా కొత్త కథ తట్టింది. అదే ‘రన్ రాజా రన్’ మూవీ. సూపర్ హిట్ అయ్యింది. తర్వాత ప్రభాస్‌తో ‘సాహో’.. హాలీవుడ్ రేంజ్ మేకింగ్, కానీ మిక్స్డ్ రెస్పాన్స్. బాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయి. కానీ చేయలేదు.

చివరకు పవన్ కాల్ చేశాడు. సొంత కథతో ‘ఓజీ’ తీశాడు. 2022లో మొదలుపెట్టి.. 3 ఏళ్లు షూటింగ్ చేశారు. స్టోరీ మొత్తం పవన్(pawan kalyan) క్యారెక్టర్ చుట్టూ.. పర్సనల్ లైఫ్ చుట్టూరే తిరుగుతుంది.

2020లో హైదరాబాద్ డెంటిస్ట్ ప్రవల్లికను పెళ్లి చేసుకున్నాడు. 11 ఏళ్లలో 3 సినిమాలు మాత్రమే తీశాడు. అన్నీ స్టార్ హీరోలతోనే చేశాడు. హిట్ కొట్టాడు.

Read Also :